నేటి యువత కొత్త ఫ్యాషన్ కు బాగా అలవాటై పోయారు. ఇది ట్రెండ్ అంటే చాలు ఇట్టే దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. మరీ ముఖ్యంగా స్టైలీష్ గా ఉండేందుకు జుట్టు, గడ్డాలతో ప్రయోగాలకు సిద్ధమై పోతుంటారు. ట్రెండ్ ను ఫాలో అవ్వడంలో ఏమాత్రం ఆలస్యం చేయరు. ఇదిలా ఉంటే ఏ ఒక్క అవకాశం వచ్చినా తమ దయాగుణాలను నిరూపించుకుంటారు. అవసరమైతే వెనకా ముందు ఆలోచించకుండా ఎవ్వరికీ సాయం కావాలన్నా మేమున్నామంటూ ముందుకు వస్తారు.
బ్లడ్ డొనేట్ నుంచి తమకు వీలైన అన్ని దానాలను చేసేస్తుంటారు. ఇదిలా ఉంటే ట్రెండ్ ను ఫాలో అవుతూ మనీ డొనేట్ కు యువత సిద్ధం అవుతోందండి.. అదెలాగంటారా.. అయ్యో మీకు తెలియదా.. నవంబర్ వచ్చిందంటే చాలా కుర్రాళ్లు షేవింగ్ కు బ్రేక్ వేసి దానికయ్యే ఖర్చులను పోగు చేసి క్యాన్సర్ రోగులకు డొనేట్ చేసేందుకు ముందుకొస్తారు. నవంబర్ వచ్చిందంటే చాలు గడ్డాన్ని షేవ్ చేయకుండా పెంచుతారు. ఇది కొన్నేండ్లుగా కొనసాగుతోంది.
ఈ నో షేవ్ నవంబర్ అనే సాంప్రదాయం 2009 నుంచి కొనసాగుతూ వస్తోంది. దీని ముఖ్యోద్దేశం ఒక నెల గడ్డం తీయకుండ అలాగే ఉంచాలి. కాని గడ్డం తీసేయడానికి లేదా స్టైలీష్ గా మార్చడానికయ్యే ఖర్చులన్నింటిని మిగిల్చి క్యాన్సర్ రోగులను ఆదుకునే స్వచ్ఛంద సంస్థలకు డొనేట్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. దీనిని అమెరికాలో ప్రారంభించారు. అమెరికాకు చెందిన మాథ్యూ హీల్ అనే క్యాన్సర్ తో మరణించారు. దీంతో ఆయన పిల్లలు 2007 లో నవంబర్ లో ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. క్యాన్సర్ మూలంగా ఎంతో మంది చనిపోతున్నారని దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నవంబర్ నెలను ఎంచుకున్నారు.
నవంబర్ లో అందరి చేత దీనిపై అవగాహన కల్పించి ప్రజలందరి చేత క్యాన్సర్ పై కృషి చేస్తున్న పరిశోధనకు, స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం ఇప్పించేందుకు పూనుకున్నారు. దాని ప్రకారమే ప్రజలకు దానిపై అవగాహన కల్పించారు. అది అమెరికాలో ట్రెండ్ గా మారి ప్రపంచ దేశాలకు పాకింది. ఈ నో షేవ్ నవంబర్ లోగోలతో బట్టలు, ఫ్యాషన్ వస్తువులు కూడా ఆన్ లైన్ లో ట్రెండ్ గా మారాయి. దీంతో యువకులు ఈ సాంప్రదాయన్ని పాటిస్తూ తమ వంతు సాయపడ్డానికి పూనుకుంటున్నారు.