Aparichithudu: అప్పట్లో శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా 2005 లో “అపరిచితుడు” సినిమా మా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు తమిళం భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. మూడు విభిన్నమైన పాత్రలతో.. హీరో విక్రమ్ నటించడం జరిగింది. రాము, రేమో, అపరిచితుడు పాత్రలు వేయడం జరిగింది. ఈ మూడింటిలో “అపరిచితుడు” క్యారెక్టర్ సినిమా మొత్తానికి హైలెట్.
సమాజంలో అవినీతిని హరి కట్టే రీతిలో మానసిక రోగిగా విక్రం తయారయ్యి “అపరిచితుడు” గా మారి తన దృష్టికి వెబ్ సైట్ ద్వారా వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించడమే కాక దానికి బాధ్యులైన వారిని అక్కడికక్కడే నరకంలో విధించే శిక్షలు అమలు చేసే విధంగా చిత్రహింసలు పెట్టి చంపేస్తాడు. ఇదిలా ఉంటే 1994 లో డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో యాంగ్రీ మాన్ రాజశేఖర్ “అపరిచితుడు” టైటిల్ తో సినిమా చేయడం జరిగిందట.
Read More: Vikram: విక్రమ్ ఫస్ట్ లుక్ రిలీజ్..! ముగ్గురు మొనగాళ్లు ఒకే ఫ్రేమ్ లో..
దాదాపు సినిమాకి సంబంధించి 10 పర్సంటేజ్ షూటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా… మధ్యలోని ఆగిపోయినట్లు ఇటీవల ఒక వార్త సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా 2005వ సంవత్సరంలో డైరెక్టర్ శంకర్ శ్రీను వైట్లను టైటిల్ ని అడిగిన టైం లో ఆయన ఇచ్చేయడం జరిగినట్లు కూడా వార్తలు సరి కొత్త విషయం బయటపడింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అపరిచితుడు అంటే విక్రమ్.. మాత్రమే అతనికి మరొకరిని సాటి చేయలేమంటూ.. నెటిజన్లు తాజా వార్త పై కామెంట్లు పెడుతున్నారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!