ఇటు వైసిపిలోనూ, అటు తెలుగుదేశం పార్టీలోనూ చూసుకుంటే రెండు వైపులా అసమ్మతి ఉంది. రెండు పార్టీలలోనూ నిరసన సెగలు రగులుతున్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. మరి అవి ముదిరేలోపే చక్కదిద్దుకోకపోతే అధినేతలకే అసలు ముప్పు అని కూడా అంటున్నారు.విషయానికి వస్తే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఒకే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నాయి. అదే అసంతృప్తి. రెండు పార్టీలలోనూ అధినేతల మీదనే ఈ అసమ్మతి రాగాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
previous post