NewsOrbit
న్యూస్

తమ్ముళ్ల డిమాండ్: సీనియర్లు తగ్గకపోతే… జగన్ తగ్గేది లేదు బాబు!

2019 ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీలో హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. కరోనా కాలంలో అధినేత కనుమరుగైపోయిన తరుణంలో… ఆ డిస్కషన్స్ మరింతగా పెరిగాయి. ఈ క్రమంలో “యువరక్తం మచ్ నీడెడ్” అనే టాపిక్ ఇప్పుడు ఏపీ టీడీపీలో తెరపైకి వచ్చింది. యంగ్ సీఎం జగన్ ని తట్టుకోవాలంటే.. బాబు & మరికొందరు సీనియర్లు సరిపోవడం లేదని… వీరి పాతచింతకాయపచ్చడి ఆలోచనలు, దూకుడు జగన్ కు ఏమాత్రం లెక్కలోకి రావని.. కాబట్టి యువకులతో పార్టీని నింపాలని డిస్కషన్స్ నడుస్తున్నాయంట.

ఈ విషయంలో చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ని టీడీపీ తరుపున సీఎం క్యాండిడేట్ గా చూపించినంత మత్రాన్న ప్రయోజనం ఉండదని పలువురు సీనియర్లు బాహాటంగానే చెబుతున్నారంట. కేవలం లోకేష్ ని మాత్రమే ముందుండి నడిపిస్తూ.. వెనక అంతా సీనియర్ బ్యాచ్ ని పెడితే… వ్యవహారం చెడిపోతుందని వారు భావిస్తున్నారంట. అందుకే తమ వారసులను లైన్ లో పెట్టి పార్టీకి కొత్త ఉత్సాహం ఇవ్వలేని పక్షంలో.. భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఊహలకు అందవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట!

అందులో భాగంగా… ఉత్తరాంధ్రలో పెందుర్తిలో మాజీ మంత్రులు బండారు స‌త్యనారాయ‌ణ మూర్తి, అయ్యన్న పాత్రుడి త‌న‌యులు.. గుంటూరులో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుమారుడు రాయ‌పాటి రంగారావు.. ప్రకాశం జిల్లాలో దామ‌చ‌ర్ల స‌త్య.. కృష్ణాజిల్లాలో మండ‌లి బుద్ధ ప్రసాద్ త‌న‌యుడు రంగంలోకి దిగడానికి రెడీగా ఉన్నారని టాక్స్ వినిపిస్తున్నాయి. వీరంతా చంద్రబాబుతో కలిసి నడిస్తే ప్రయోజనం ఉండదని… లోకేష్ నాయకత్వంలో ఈ యువరక్తాన్ని జనాల్లోకి వదలాలని అంటున్నారట.

ఇదే క్రమంలో తూర్పు గోదావ‌రిలో య‌న‌మ‌ల కుమార్తె.. ప‌శ్చిమ గోదావ‌రిజిల్లాలోమాగంటిబాబు కుమారుడు జిల్లా తెలుగు యువ‌త అధ్యక్షుడు రాంజీ లు ఉత్సాహంతో ఉన్నారని… వీరే కాకుండా ఇలా ఇలా ప్రతి జిల్లాలోనూ యువ నేత‌ల లిస్ట్ బాగానే ఉండటం వల్ల… వారంతా చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారట సీనియర్లు! మరి… బాబు కూడా ఈ సీనియర్ల బాదను అర్ధం చేసుకుని.. రాబోయే నాలుగేళ్లలో పార్టీని యువరక్తంతో బలపరిచే పనికి పూనుకుంటారా లేక తనకు సీనియర్స్ తోనే కంఫర్ట్ అని కొడుకుని ఇప్పటికైనా ముందుపెట్టకుండా.. వెనకాలేసుకునే తిరుగుతారా అనేది వేచి చూడాలి!

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju