పవన్ కళ్యాణ్ – అజిత్ ల విషయంలో నిర్మాత ఇచ్చిన స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ తో ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ ..!

తామూ అభిమానించే హీరోల విషయంలో ఆ అభిమానుల అంచనాలు ఊహించని స్దాయిలో ఉంటాయన్న విషయం తెలిసిందే. అందుకే ఒక్కోసారి అభిమానుల అంచనాలను అందుకోలేకపోయిన చిత్రాలు, అపజయాన్ని మూటగట్టుకుంటూ ఉంటాయి. ఇక అభిమానులు ఆదరించే హీరోలకు సంబంధించిన ఏ చిన్న విషయం కూడా దాగకుండా ఎక్కువగా ప్రచారం లో నిలుస్తుంటాయి. తమ హీరోలకు సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా ఫ్యాన్స్ వదలరని ఎన్నో సార్లు రుజువు అయ్యింది. ఇప్పుడు ఇద్దరి స్టార్ హీరోలు.. ఒక స్టార్ ప్రొడ్యూసర్ కి సంబంధించిన న్యూస్ కూడా ఇలాగే వైరల్ గా మారింది.

Pavan Kalyan looks on another film of Ajit – Andhra Prabha Telugu Daily

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లకు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ పార్టీ ఇచ్చాడట. మరి ఈ విషయం నిజమా అబద్దమా అనేది ఇంతవరకు ఎవరి వైపు నుంచి క్లారి రాలేదు. ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. బోనీ కపూర్ నిర్మాతగా ఇదివరకు పింక్ ను తమిళంలో అజిత్ హీరోగా నిర్మించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అదే పింక్ సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ అవుతోంది. ఇక పింక్ రీమేక్ రైట్స్ తన వద్ద ఉండటం వల్ల బోనీ కపూర్ కూడా వకీల్ సాబ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.

ఇదే సమయంలో ఈ రెండు చిత్రాలు హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్న నేపధ్యంలో బోనీ కపూర్ ఈ చిత్ర షూటింగ్ ను పర్యవేక్షించేందుకు హైదరాబాద్ వచ్చినందుకు.. ఇదే న్యూస్ ఇంకోలా స్ప్రెడ్ అయింది. అజిత్ .. పవన్ లకు బోనీ కపూర్ స్పెషల్ గా పార్టీ ఇచ్చాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో స్పందించిన బోనీ కపూర్ తానూ గత రెండు వారాలుగా పూర్తిగా ముంబయికే పరిమితం అయ్యాయని, ఇలాంటి సమయంలో తాను ఈ హీరోలకు పార్టీ ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని కొట్టిపారేసారట. దీంతో పవన్ కళ్యాణ్, అజిత్ ల విషయంలో ఈ నిర్మాత ఇచ్చిన స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ తో రూమర్స్ క్రియోట్ చేసిన ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అయిందని చెప్పుకుంటున్నారు.