NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Suicide: బిల్డింగ్ పై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్య .. మోహన్ బాబు కాలేజీ హాస్టల్లో ఘోరం..! ఇది ఎన్నోది..!?

Share

Suicide: వయసు ఇరవై ఏళ్ళు నిండనే లేదు.. లోకంపై అవగాహన పెరగనే లేదు.. చదువు నేర్పని సంస్కారం గురించి తెలియనే లేదు.. అంతలోనే ఆ యువతీ భవనం పై నుండి దూకేసి ఆత్మహత్య చేసుకుంది..! నాలుగంతస్థుల హాస్టల్ భవనం నిమిషాల్లో ఎక్కేసి, క్షణాల్లో దూకేసి ప్రాణాలు తీసుకుంది..! ఈ ఘోరం జరిగింది ఎంతో పేరు మూటగట్టుకున్న శ్రీ విద్యానికేతన్ హాస్టల్ లో.. దీని యజమాని సంఘంలో మరీ గొప్ప పేరున్న మంచు మోహన్ బాబు.. కానీ ఏం జరగనట్టు ప్రధాన మీడియాలు కవరేజీ లేదు, విద్యార్థి సంఘాల నోరెత్తలేదు.., పోలీసుల కేసుల హడావిడి లేదు.. 24 గంటలు గడిచింది.., అసలు ఏం జరగనట్టు మొత్తం కళాశాల, హాస్టల్ యధాతథంగా కొనసాగుతున్నాయి..! ఇంతకూ ఆమె ఎందుకు అంత ఘోరంగా ఆత్మహత్యకు పాల్పడింది..!? ఆ కళాశాలలో ఏం జరుగుతుంది..!?

Suicide: పేరు వాసంతి – వయసు 19..!

చంద్రగిరి మండలం, ఏ.రంగంపేట సమీపంలో ఈ శ్రీ విద్యానికేతన్ హాస్టల్ ఉంది. ఇక్కడికి కాస్త దూరంలో కళాశాల ఉంది. కడప నగరానికి చెందిన వాసంతి (19) శ్రీ విద్యానికేతన్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఇటీవల జరిగిన పరీక్షలో మార్కులు తక్కువగా వచ్చాయి. కళాశాలలో ఏమంటారో..? ఇంట్లో తెలిస్తే ఏమంటారో..!? అనే భయంతో రెండు రోజులుగా దిగులుగా గడుపుతుంది.. నిన్న సాయంత్రం కాలేజీ ముగిసిన తర్వాత హాస్టల్ లోకి వచ్చి.. బిల్డింగ్ ఎక్కి వెంటనే దూకేసింది. క్షణాల వ్యవధిలో కన్నుమూసింది. వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు, సహా విద్యార్థులు ఆమెను ఆసుపత్రికి చేర్చినా ఫలితం లేదు. అప్పటికే మరణించింది. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె దూకిన వీడియో హల్చల్ చేస్తుంది. మోహన్ బాబు కాలేజీకి చెందిన విద్యార్థిని కావడంతో.. క్రమశిక్షణ అంటూ కబుర్లు చెప్పే మోహన్ బాబు.., ఇటువంటి ఘటనలను డయడంలో ఏ మాత్రం వెనుకాడరనే పుకార్లున్నాయి.

* నాలుగేళ్ల కిందట కూడా ఇదే కళాశాలలో ఏసీసీ రెండో సంవత్సరం చదువుతున్న అమర్ నాథ్ రెడ్డి అనే విద్యార్ధి తనకు తక్కువ మార్కులు వచ్చాయని ఆత్మహత్య చేసుకున్నాడు. “తన మరణానికి కళాశాల సిబ్బంది, అధ్యాపకుల వేధింపులే కారణమని” అప్పుడు సూసైడ్ నోట్ కూడా రాసాడు. ఇప్పుడు వాసంతి ఎటువంటి లేఖ రాయకపోయినప్పటికీ కారణం మాత్రం అదే..

* ఈ కళాశాలలో తక్కువ మార్కులు వచ్చిన వారిని డీల్ చేసే విధానం వేరేలా ఉంటుందనే ఆరోపణలు ఎప్పటి నుండో వినిపిస్తున్నాయి. నెలకోసారి నిర్వహించే పరీక్షలు.. ఆరునెలలకోసారి జరిగే సెమిస్టరు పరీక్షలు, ఇంటర్నల్ ఇలా ఏ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినా ట్రీట్మెంట్ మరీ కఠినంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అందుకే తరచూ విద్యార్థులు ఒత్తిడికి గురవుతూ.., చాలా సార్లు ప్రయత్నాలు చేస్తుంటారని ఫిర్యాదులున్నాయి.

ఈ వీడియో ప్రధాన మీడియాలకు చేరలేదా..!?

మీడియా చాలా వేగంగా ఉంది. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా క్షణాల్లో వాలిపోతుంది. బైట్లు, లైవులు అంటూ హడావిడి చేస్తుంది. అటువంటిది ఒక పెద్ద పెద్ద మాటలు చెప్పే పెద్ద వ్యక్తి కళాశాలలో ఇటువంటి ఘోరం జరిగితే.. ఆ వీడియో కూడా చక్కర్లు కొడుతుంటే కనీసం ప్రధాన మీడియా ఏ మాత్రం చూపించలేదు. భవనంపై నుండి దూకడం.. వెంటనే మరణించడం అన్నీ 20 క్షణాల వ్యవధిలో వీడియోలో ఉన్నాయి..! ఆ కళాశాల యజమాని మోహన్ బాబు కావడం.. ఆయనకు మీడియా పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ప్రధాన మీడియా, పత్రికలూ ఎక్కడా ఈ వార్త రాలేదు. సాధారణ చిన్న వార్తగా కనీసం కాలేజీ పేరు కూడా లేకుండా వేశారు. పేరు గొప్పగా ఉన్న పెద్ద పెద్ద పత్రికల్లో కూడా “ఓ కళాశాల.., ఓ ప్రైవేటు కళాశాల హాస్టల్” అంటూ రాసి.., తమ అభిమానం చాటుకున్నారు..!


Share

Related posts

Fuel Price Rise: 44రోజుల్లో 25 సార్లు పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలు!శరవేగంతో వంద మార్కును దాటేసిన వైనం !!

siddhu

Mudragada Padmanabham: మళ్లీ యాక్టివ్ అవుతున్న ముద్రగడ..! కీలక అంశంపై తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులకు లేఖలు..!!

somaraju sharma

నాగార్జునతో పూరి జగన్నాధ్ ఇలాంటి సినిమా తీస్తాడని ఎవరైనా ఊహించారా ..?

GRK