వామ్మో.. స్కిప్పింగ్ తాడుతో ఇలాంటి విన్యాసాలు కూడా చేస్తారా? వైరల్ వీడియో

ఈ ప్రపంచంలో ఏ పని చేసినా.. దాన్ని వినూత్నంగా చేస్తే చాలు.. గుర్తింపు అదే వస్తుంది. అందరిలో కాకుండా.. గుంపులో గోవిందలా కాకుండా.. కొత్తగా.. వింతగా ట్రై చేస్తే ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుంది.

stunt with skipping rope video goes viral
stunt with skipping rope video goes viral

అందులోనూ నేటి జనరేషన్ లో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా ఈజీగా ప్రపంచానికి తమ టాలెంట్ ను చూపించుకునే అవకాశం కూడా ఉంది.

ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. స్కిప్పింగ్ తాడుతో చేసే విన్యాసాలకు సంబంధించిన వీడియో అది.

ఇంటర్నేషనల్ రేంజ్ జంప్ రోప్ అథ్లేట్ జోరావర్ సింగ్ తన ఫ్రెండ్స్ తో కలిసి చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వాళ్ల స్టంట్స్ చూసి ఆశ్యర్యపోతున్నారు.

స్కిప్పింగ్ తాడుతో ఇలాంటి విన్యాసాలు కూడా చేయొచ్చా? అని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి..