Pakka commercial : పక్కా కమర్షియల్‌గా స్టైలిష్ గోపీచంద్

Share

Pakka commercial : యాక్షన్ హీరోగా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న గోపీచంద్ లేటెస్ట్ సినిమాగా పక్కా కమర్షియల్ రూపొందుతోంది. మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బబ్లీ బ్యూటీ హిట్ పెయిర్ అన్న క్రేజ్ ఉన్న రాశీఖన్నా పక్కా కమర్షియల్ లో హీరోయిన్ గా నటిస్తుంది. గత రెండు మూడేళ్ళుగా గోపీచంద్ హిట్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నాడు. ఆయన లాస్ట్ సినిమా గౌతం నంద డ్యూయల్ రోల్ లో నటించాడు. సంపత్ నంది దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన గౌతం నంద బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాగా మిగిలింది.

stylish gopichand in pakka-commercial
stylish gopichand in pakka-commercial

ఆ తర్వాత గోపీచంద్ కి బాగానే గ్యాప్ వచ్చింది. దానికి తోడు కరోనా కూడా దెబ్బ కొట్టింది. దెబ్బ మీద దెబ్బతో నలిగిపోతున్న ఈ హీరోకి మంచి కమర్షియల్ హిట్ పడాలి. ఈ క్రమంలో సంపత్ నందితోనే సినిమా చేస్తున్నాడు. సీటీమార్ టైటిల్ తో తెరకెక్కుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా సీటీమార్ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతోంది. అన్నీ పనులు పూర్తి చేసుకొని రిలీజ్ చేయాలని మేకర్స్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు కూడా. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల మళ్ళీ పోస్ట్ పోన్ చేసి కొత్త డేట్ మళ్ళీ ప్రకటిస్తామని అన్నారు. కానీ ఇంకా సీటీమార్ కొత్త రిలీజ్ డేట్ రాలేదు.

Pakka commercial : పక్కా కమర్షియల్, సీటీమార్ సినిమాలు సూపర్ హిట్ అయితే గోపీచంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టే.

కానీ నెక్స్ట్ సినిమా మాత్రం పట్టాలెక్కింది. అదే పక్కా కమర్షియల్. పేరుకే పక్కా కమర్షియల్ టైటిల్. కానీ తాజాగా రిలీజ్ చేసిన గోపీచంద్ బర్త్ డే పోస్టర్ లో మాత్రం చాలా స్టైలిష్ గా ఉన్నాడు. హీరోయిన్ రాశీఖన్నా లాయర్ పాత్రలో నటిస్తోంది. గోపీచంద్ కూడా లాయర్ పాత్రలోనే నటిస్తున్నాడని సినిమా ప్రకటించినప్పుడు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో గోపీచంద్ పాత్ర ఏంటనేది సస్పెన్స్ గా ఉంది. కానీ లేటెస్ట్ పోస్టర్ మాత్రం గోపీచంద్ కి మంచి హిట్ ఇస్తుందని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి సీటీమార్, పక్కా కమర్షియల్ సినిమాలు సూపర్ హిట్ అయితే ఇక గోపీచంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టే.


Share

Related posts

Today Horoscope జనవరి -1- శుక్రవారం ఈ రోజు రాశి ఫలాలు.

Sree matha

వినూత్న పద్దతిలో కరోనా ని కట్టడి చేస్తున్న సౌత్ కొరియా

Siva Prasad

నైవేద్యం గా చక్కెర పెడితే ఏమవుతుంది?

Kumar