SUSCIDE: పెళ్లిలో కన్యాదానం చేసిన తరువాత వధువు తల్లి తండ్రులు ఆత్మహత్య..!

Share

SUSCIDE: పెళ్లి అంటేనే ఆ ఇంట్లో సందడి వాతావరణం మొదలైపోతుంది. బంధువుల హడావుడితో, మేళతాళాలతో ఇల్లంతా కోలాహలంగా మారిపోతుంది కదా. అలాగే ఇంట్లో పెళ్లి అంటే అమ్మానాన్నలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అందులోను ఆడపిల్ల తల్లితండ్రులు అయితే మరి సంబర పడిపోతారు. ఒకింత కూతురిని అత్తారింటికి పంపిస్తున్నామనే బాధ మనసులో ఉన్న అవన్నీ దిగమింగుకుని కూతురుకి పెళ్లి చేస్తారు. మంచి వరుడిని తెచ్చి కూతురికి పెళ్ళికి చేసి మంచి కుటుంబంలోకి పంపాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే ఒక ఆడపిల్ల తల్లి తండ్రులు కూడా కూతురి పెళ్ళిని అంగరంగ వైభవంగా చేసారు. కన్యాదానం కూడా చేసేసారు. కానీ ఇంతలోనే వధువు తల్లి తండ్రులు చనిపోయారు. కాళ్ళ పారాణి ఆరకముందే వధువు శోక సంద్రంలో మునిగిపోయింది.

JAGAN: ఏదైనా వ్యాపారానికి ఋణం కావాలా ? వై ఎస్ జగన్ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ ఉపయోగించుకోండి , ఇలా అప్లయ్ చేసుకోండి !

అసలు వివరాల్లోకి వెళితే.. ఈ విషాదకరమైన సంఘటన విశాఖపట్నం జిల్లా హెచ్‌బీ కాలనీలోని భానునగర్‌లో గురువారం తెల్లవారుజామున జరిగింది.ఈ ఘటన అక్కడ కల్యాణ మండపంలో ఉన్నా అందరితోను కంటతడి పెట్టించింది. ఎంవీపీ జోన్‌ సీఐ రమణయ్య తెలిపిన వివరాల ప్రకారం భానునగర్‌కు చెందిన వడ్డాది జగన్నాథరావు, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. మొదటి కూతురు పెళ్లి చేసేసారు. ఇప్పుడు రెండో కుమార్తె అయిన భారతి వివాహం నిన్న గురువారం తెల్లవారు జామున హెచ్‌బీ కాలనీలోని మయూరి ఫంక్షన్‌ హాలులో ఘనంగా చేసారు. ముందురోజు మధ్యాహ్నమే అందరు ఫంక్షన్‌ హాలుకు చేరుకున్నారు.తెల్లవారుజామున పెళ్లి అయ్యాక తల్లితండ్రులు దగ్గర ఉండి మరి కన్యాదానం కూడా చేశారు.
Anasuya: ఇండస్ట్రీలో మరో మెగా బంపర్ ఆఫర్ కొట్టేసిన అనసూయ..??

ఆ తరువాత పెళ్లిలో ఎక్కడా కనిపించలేదు. పెళ్లి మండపం అంతా తలోకదిక్కు వెతికిన ఆ దంపతుల జాడ తెలియలేదు. ఒకవేళ ఇంటికి ఎమన్నా వెళ్లారేమో అని జగన్నాథరావు అన్న కుమారుడు వడ్డాది వెంకట్‌ భానునగర్‌ లోని ఉన్న ఇంటికి వెళ్లి చూసి షాక్ కి గురి అయ్యాడు. బాబాయ్, పిన్ని లను చూసి నోట మాట రాలేదు. వారి ఇరువురు చనిపోయారు. జగన్నాథరావు రూమ్ లో ఉన్న ఫ్యాన్‌ కు ఉరి వేసుకొని చనిపోయాడు. అలాగే విజయలక్ష్మి మంచంపై చనిపోయి ఉంది. శుభమా అని పెళ్లి జరిగిన కొద్ది సేపటికే దంపతులు చనిపోవడం ఏంటి అని అందరు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దంపతుల మృతికి కారణాలు తెలియలేదు. గత కొంత కాలం నుంచి విజయలక్ష్మి మానసిక సమస్యతో బాధపడుతున్నదని ఈ కారణంగా భార్య భర్తలు గొడవ పడే వారని వారి బంధువులు చెబుతున్నారు. పెళ్లి జరిగే సమయంలో కూడా భార్య భర్తలు దేని గురించో గొడవపడినట్టు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీలను కేజీహెచ్‌ హాస్పిటల్ కు తరలించారు.

Praveen Kumar: టీఆర్ఎస్, బీజేపీపై ప్రవీణ్ కుమార్ హాట్ కామెంట్స్..


Share

Related posts

Sun Tan: 5 నిమిషాల్లో సన్ టాన్ ను తొలగించుకోండి..!!

bharani jella

బ్రేకింగ్: తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Muraliak

టీటీడీ ఓకే..! దుర్గమ్మకి కోపం రాకమునుపే ఇది చూడండి..!!

Special Bureau