ఇది.. ఇదే కదా కావాల్సింది. బుల్లి తెరపై సుధీర్, రష్మీ జంటకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. వాళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా సూపర్బ్ గా ఉంటుంది. కానీ.. వాళ్లు కలిసి డ్యాన్స్ వేయడం చాలా అరుదుగా చూస్తుంటాం.

నిజానికి ఒకరంటే మరొకరికి చచ్చేంత ప్రేమ. కానీ.. దాన్ని మనసులోనే దాచుకుంటారు. సుధీర్.. అప్పుడప్పుడు రష్మీ మీద ఉన్న ప్రేమను స్కిట్లలో చెబుతుంటాడు. అప్పుడు రష్మీ కూడా పాజిటివ్ గానే రిసీవ్ చేసుకుంటుంది.
ఈ జంటకు బుల్లితెర మీద మామూలుగా డిమాండ్ ఉండదు. వీళ్లిద్దరు కలిసి అప్పుడప్పుడు ఢీ షోలో డ్యాన్స్ వేస్తుంటారు కానీ.. ఎక్స్ ట్రా జబర్దస్త్ షో ఎక్కువగా కలిసి డ్యాన్స్ వేయలేదు.

కానీ.. ఎక్స్ ట్రా జబర్దస్త్ 300వ ఎపిసోడ్ లో ఆ చాన్స్ దక్కింది. దీంతో ఇద్దరు కలిసి డ్యాన్స్ లో కుమ్మేశారు. స్టేజ్ మీద రచ్చరచ్చ చేశారు.
దానికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ తాజాగా విడుదల చేసింది. ఆ ప్రోమోలో రష్మీ, సుధీర్ డ్యాన్స్ చూస్తే మీ మతి పోతుంది. నెటిజన్లు కూడా ఆ డ్యాన్స్ చూడటానికి వేయి కళ్లతో ఎదురు చూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు.