సుడిగాలి సుధీర్, రష్మీ జంటకు సోషల్ మీడియాలో కానీ.. బుల్లి తెర మీద కానీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మూమూల్ది కాదు. ఓ రేంజ్ లో ఉంటుంది. ఆ జంట కోసమే ఎన్నో షోలను డిజైన్ చేసిన రోజులూ ఉన్నాయి. సుధీర్, రష్మీ అంటేనే వేరే లేవల్. కానీ.. ఇదంతా ఒకప్పటి మాటేనా. ఇప్పుడు ఆ జంటకు అంత సీన్ లేదా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

ఎందుకంటే.. ఒకప్పుడు ఈ జంట క్రేజ్ మామూలుగా లేదు. కానీ.. ఇప్పుడు ఈ జంట అసలు కలిసి ఎక్కువగా నటించడం లేదు. ఏదో అడపాదడపా తప్పితే ఈ జంట పెద్దగా లైమ్ లైట్ లోకి రావడం లేదు. ఏదో డీజే 2021 న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్ లో ఆది స్కిట్ లో సుధీర్, రష్మీ కలిసి కనిపించారు కానీ.. అంతగా వాళ్లిద్దరి మధ్య స్కిట్ పండలేదు.
సుధీర్, రష్మీ జంటతో పాటు.. హైపర్ ఆది, వర్షిణీ జంట, సరికొత్తగా వచ్చిన ఇమ్మాన్యుయేల్, వర్ష జంట ప్రస్తుతం బుల్లితెర మీద తెగ హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ జంట ఫేడ్ ఔట్ అయిపోతోందనే వార్తలూ వస్తున్నాయి. ఈ జంటకు ఇదివరకు ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదని.. ఇప్పుడు క్రేజంతా.. ఇమ్మాన్యుయేల్, వర్ష జంటకే నని.. లేదంటే హైపర్ ఆది, వర్షిణీ జంటకు క్రేజ్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఏది ఏమైనా సుధీర్, రష్మీ జంటను బుల్లితెర ప్రేక్షకులు ఏనాటికీ మరవరు. మరిచే సీన్ కూడా లేదు. ఇప్పుడు క్రేజ్ తగ్గొచ్చు కానీ.. తర్వాత వాళ్ల క్రేజ్ వాళ్లకుంటుంది.. అని సుధీర్ అభిమానులు అంటున్నారు. చూద్దాం.. మరి ఈజంట ఇంకా ఎంత దూరం ప్రయాణిస్తుందో?