ట్రెండింగ్ న్యూస్

సుధీర్ ఎక్కడున్నావు? నీ గుండెల్లో ఉంటా సరిగ్గా చూడు రష్మీ.. అదిరిపోయిన సుధీర్ పంచ్?

sudheer super punch to rashmi in dhee show
Share

మీకు తెలుసు కదా.. ఢీ షో అంటే కేవలం డ్యాన్స్ షో మాత్రమే కాదు. అంతకు మించి.. అవును.. డ్యాన్స్ తో పాటు సూపర్ కామెడీ అందించే షో అది. అందుకే ఢీ షోకు అంత ఆదరణ లభిస్తోంది. ఢీ షో ప్రస్తుతం టాప్ రేంజ్ లో ఉందంటే దానికి కారణం ఆ క్రేజీ జంట. సుధీర్, రష్మీ ఎక్కడ ఉంటే ఆ షోకు అంత క్రేజ్ లభిస్తుంది.

sudheer super punch to rashmi in dhee show
sudheer super punch to rashmi in dhee show

ఢీ షోలో సుధీర్, రష్మీ, యాంకర్ ప్రదీప్, హైపర్ ఆది, వర్షిణి కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఏదైనా ఒక డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ తర్వాత.. వీళ్లంతా కలిసి కాసేపు డ్యాన్సర్లను, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు.

అయితే.. ఒక్కోసారి ఆ కామెడీ హద్దులు కూడా దాటొచ్చు. ఇంకోసారి స్పాంటెనిటితో మాట్లాడాల్సి రావచ్చు. ముందే స్క్రిప్ట్ రాసుకొని వచ్చినా అప్పుడప్పుడు ఆ సమయంలో ఏది తోస్తే అది అనేయడమే.

తాజాగా విడుదలైన ఢీ చాంపియన్స్ ప్రోమో చూస్తే అదే అర్థం అవుతుంది. సుధీర్, ఆది కళ్లకు గంతలు కట్టి.. డ్యాన్స్ చేయమంటాడు ప్రదీప్. పాట వేయగానే వాళ్లు డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తారు. ఇంతలో మరో ఇద్దరు ముగ్గురికి గంతలు కట్టి డ్యాన్స్ చేయిస్తాయి. ఇదే టైమ్ లో అక్కడికి వచ్చిన యాంకర్ రష్మీ.. సుధీర్ ఎక్కడున్నావు.. సుధీర్ ఎక్కడున్నావు.. అంటూ పదే పదే అంటుంది. దీంతో.. వెంటనే సుధీర్.. నీ గుండెల్లో ఉంటా… సరిగ్గా చూడు రష్మీ అంటూ సుధీర్ పంచేసేసరికి రష్మీకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి మరి..


Share

Related posts

Big Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంటి సభ్యులు పై రివ్యూ ఇచ్చినా నటి ప్రియ..!!

sekhar

గుడ్డు తినడంతో పాటు, ఇలా కూడా చేస్తే అందం అంతా మీ దగ్గరే ఉంటుంది!!

Kumar

బాబు గారు..!! మీకర్ధమవుతుందా..??

Srinivas Manem
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar