ఎక్స్ ట్రా జబర్దస్త్.. తెలుగు బుల్లితెర మీద టాప్ లో ఉన్న కామెడీ షోలలో ఎక్స్ ట్రా జబర్దస్త్ ఒకటి. జబర్దస్త్ నుంచి పుట్టుకొచ్చిందే ఎక్స్ ట్రా జబర్దస్త్. అయితే.. ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటేనే మనకు గుర్తొచ్చే జంట.. సుడిగాలి సుధీర్, రష్మీ. అవును.. వాళ్ల కోసమే.. ఈ షోను చూసేవాళ్లు బోలెడు.

ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీమ్ కు ఉన్న ఫాలోయింగ్ మామూల్ది కాదు. సుడిగాలి సుధీర్ స్కిట్ కోసమే చాలామంది ఎక్స్ ట్రా జబర్దస్త్ ను చూస్తారు.
అయితే.. తాజాగా సుడిగాలి సుధీర్ టీమ్ చేసిన స్కిట్ లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. సుడిగాలి సుధీర్ ఆ స్కిట్ లో హీరో. ఆయనకు బాడీగార్డ్ గా గెటప్ శీను నటించాడు. గెటప్ శీనును ప్రతిదానికి సుధీర్ కొడుతుంటాడు. దీంతో తనపై ఎలాగైనా ప్రతికారం తీర్చుకోవాలనుకున్న గెటప్ శీను.. అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. ఒకరోజు సినిమా షూటింగ్ జరుగుతుండగా.. విలన్ సెట్ కు రాకపోవడంతో.. గెటప్ శీనును విలన్ గా నటించాలంటూ డైరెక్టర్ కోరుతాడు.
దీంతో గెటప్ శీను.. అవకాశం దొరికొంది కదా.. అని సుడిగాలి సుధీర్ ను చితకబాదుతాడు. అయితే.. స్కిట్ లో మామూలుగా కొట్టకుండా.. నిజంగానే సుడిగాలి సుధీర్ ను చితకబాదేశాడు. దీంతో కుయ్యోమొర్రో అంటూ సుధీర్ మొత్తుకున్నాడు.
దానికి సంబంధించిన స్కిట్ ను మీరే చూసేయండి మరి..