Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుల్లితెర మీద ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో ఉన్న కమెడియన్. సుడిగాలి సుధీర్ కోసం ఎన్నో షోలు వెయిట్ చేస్తుంటాయి. తెలుగులో ఉన్న అన్ని ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లలో సుధీర్ కనిపిస్తుంటాడు. అన్ని చానెళ్లలోనూ పలు ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తుంటాడు సుధీర్. ముఖ్యంగా ఈటీవీలో అయితే ఏ షో వస్తే ఆ షోలో సుధీర్ ఉండాల్సిందే. సుధీర్ లేకపోతే ఆయన ఫ్యాన్స్ అసలు ఆ షోనే చూడరు. ఇటీవల ఉగాదికి వచ్చిన స్పెషల్ షో సూపర్ డూపర్ హిట్ అయింది.

జబర్దస్త్ తో పాటు ఢీ షోలో కూడా సుడిగాలి సుధీర్ పార్టిసిపేట్ చేస్తున్నాడు. నిజానికి ఢీ అనేది ఒక డ్యాన్స్ షోనే అయినా.. ఆ షోలో డ్యాన్స్ తో పాటు కామెడీ కూడా పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే… ఆ షోలో సుధీర్ తో పాటు హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్, రష్మీ, దీపిక పిల్లి.. వీళ్లంతా కలిసి చేసే హంగామా మామూలుగా ఉండదు.
Sudigali Sudheer : ఢీ షోలో ప్రియమణి డ్యాన్స్ అదుర్స్
ప్రస్తుతం యూట్యూబ్ లో సంచలనాలను సృష్టిస్తున్న సారంగ దరియా పాటకు ఢీ స్టేజ్ మీద ప్రియమణి స్టెప్పులేస్తుంది. మామూలుగా కాదు… రచ్చ రచ్చ చేసింది ప్రియమణి. ప్రియమణి స్టెప్పులకు అందరూ ఈలలు, కేరింతలు కొట్టారు. సుడిగాలి సుధీర్ అయితే ఇక అస్సలు ఆగలేకపోయాడు. ప్రియమణి గారు ఒక్కసారి ఇక్కడికి రండి… అంటూ రెండు చేతులు చాచాడు. ప్రియమణికి హగ్ ఇవ్వబోయాడు. స్టేజ్ మీదికి ఎక్కి ప్రియమణికి హగ్ ఇవ్వబోతుండగా… రష్మీ, దీపిక, ప్రదీప్.. ముగ్గురూ తనను పట్టుకొని ఆపారు. మొత్తానికి వీళ్ల కామెడీ మాత్రం ఈసారి అదిరిపోయింది. తాజాగా విడుదలైన ప్రోమోను మీరు కూడా చూసేయండి.