Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సుధీర్ అంటేనే ఓ బ్రాండ్. ప్రస్తుతం తెలుగు బుల్లితెరను ఏలుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది సుడిగాలి సుధీర్ మాత్రమే. సుడిగాలి సుధీర్ ఎక్కడ ఉంటే అక్కడ రచ్చ రంబోలానే. జబర్దస్త్ ను ప్రస్తుతం కోట్ల మంది చూస్తున్నారంటే దానికి కారణం సుధీర్ మాత్రమే. అందుకే. సుధీర్ కు అంత క్రేజ్. ఆయన ఎక్కడుంటే అక్కడ హడావుడే.

అయితే. కమెడియన్ గా తన కెరీర్ ను ప్రారంభించిన సుడిగాలి సుధీర్.. తాజాగా యాంకర్ అవతారం కూడా ఎత్తాడు. ఇదివరకు ఈటీవీలో పోవే పోరా, ఇంకా కొన్ని షోలలో యాక్ట్ చేసినా.. సుధీర్ కు యాంకరింగ్ అవకాశాలు రాలేదు.
కానీ.. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో హోలీ స్పెషల్ గా వచ్చే రంగు పడుద్ది అనే ప్రోగ్రామ్ కు యాంకరింగ్ అవకాశం వచ్చింది. యాంకరింగ్ అనే కన్నా.. తనే ఈ షోను హోస్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్లాడు.
Sudigali Sudheer : రంగు పడుద్ది షోకు గెస్ట్ గా వచ్చిన నితిన్
అయితే.. ఈ షోకు రంగ్ దే హీరో నితిన్ గెస్ట్ గా వచ్చాడు. అందరినీ కాసేపు అలరించాడు. సుధీర్ కూడా తన స్పాంటెనిటీతో షోను సూపర్ గా ముందుకు సాగించాడు.
సుధీర్ రెట్టించిన ఉత్సాహంతో హోలీ ప్రోగ్రామ్ ను సూపర్ సక్సెస్ చేశాడు అని చెప్పడానికి తాజాగా విడుదలైన ప్రోమో చూస్తేనే చెప్పొచ్చు.
ఇప్పటికే ఒక ప్రోమోను రిలీజ్ చేసిన ఈటీవీ.. తాజాగా మరో ప్రోమోను రిలీజ్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా వెంటనే ఆ ప్రోమోను చూసేయండి మరి.