ట్రెండింగ్ న్యూస్

Sudigali Sudheer : నాకు అమ్మానాన్న అన్నీ రష్మీనే.. ఎమోషనల్ అయిన సుధీర్?

sudigali sudheer birthday celebrations in extra jabardasth set
Share

Sudigali Sudheer : జబర్దస్త్ అంటేనే మనకు గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్, రష్మీ జంట. జబర్దస్త్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంట ఎవర్ గ్రీన్ అయిపోయింది. వీళ్లిద్దరి మధ్య ఏమున్నది? లేదు? అనేది పక్కన పెడితే.. ఈ జంటకు ఉన్న క్రేజ్ మాత్రం మామూల్ది కాదు. సుధీర్, రష్మీ… ఎక్కడుంటే అక్కడ రచ్చే. ఇద్దరి జోడి కూడా బాగుంటుంది. అందుకే…. ఇద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని చాలామంది సుధీర్, రష్మీ అభిమానులు కోరుకుంటున్నారు. అది ఎప్పుడు జరుగుతుందో పక్కన పెడదాం.

sudigali sudheer birthday celebrations in extra jabardasth set
sudigali sudheer birthday celebrations in extra jabardasth set

వాళ్లిద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని.. వాళ్లు చెబుతున్నప్పటికీ.. వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం మాత్రం చాలా గట్టిది. అందుకే ఇప్పటికీ… అప్పుడప్పుడు సుధీర్ స్కిట్ లో అలా మెరుస్తుంటుంది రష్మీ. రష్మీకి కూడా సుధీర్ అంటే ప్రాణం కానీ.. బయటికి చెప్పదు. సుధీర్ మాత్రం ఆగలేక బయటికి చెప్పేస్తుంటాడు.

Sudigali Sudheer : ఎక్స్ ట్రా జబర్దస్త్ సెట్ లో సుధీర్ బర్త్ డే సెలబ్రేషన్స్

అయితే… స్కిట్ లో భాగంగా సుధీర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఎక్స్ ట్రా జబర్దస్త్ సెట్ లో నిర్వహించారు. ఈసందర్భంగా రష్మీ వచ్చి సుధీర్ తో కేక్ కట్ చేయిస్తుంది. కేక్ కట్ చేశాక ముందుగా రష్మీకి కేక్ తినిపిస్తాడు సుధీర్. దీంతో… ముందు నాకు ఎందుకు కేక్ తినిపించావు. ముందు అమ్మకు కానీ… నాన్నకు కానీ తినిపిస్తారు కదా… అని రష్మీ అడిగేసరికి… నాకు అమ్మ అయినా… నాన్న అయినా అన్నీ నువ్వే రష్మీ అనేసరికి రష్మీ చిరునవ్వు నవ్వుతుంది. మొత్తం మీద మరోసారి వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందా? అనే విషయం తెలియాల్సి ఉంది.


Share

Related posts

Singer Sunitha: ‘క్షమాపణలు అడుగుతున్నా.. ఇంకెప్పుడూ చేయను’ సింగర్ సునీత భర్త సంచలన వ్యాఖ్యలు!

Ram

కరోనా ఎఫెక్ట్ : ఏపీలో లాక్ డౌన్ లోకి మరో జిల్లా

somaraju sharma

వీడియో: శ్రీశైలం అగ్నిప్రమాదంలో చనిపోయిన టిఎస్ జెన్కో ఉద్యోగుల ఆఖరి మాటలు

Vihari