Sudigali Sudheer : సుడిగాలి Sudigali Sudheer సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే తేడా లేకుండా సుడిగాలి సుధీర్.. స్కిట్లు చేస్తున్నాడు. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ఆయన సొంత స్కిట్ చేసుకోవాలి. మళ్లీ వేరే టీమ్ లీడర్ పిలిస్తే ఆ స్కిట్ కూడా చేయాలి. మొత్తం మీద సుడిగాలి సుధీర్ కు ఉన్న సుడి ఎవ్వరికీ లేదండి. అందుకే.. సుధీర్.. బుల్లితెరకే హీరో అయిపోయాడు. బుల్లితెర మీద ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకెవ్వరికీ లేదు అంటే అతిశయోక్తి కాదు.

Sudigali Sudheer : తన స్కిట్ లో గెస్ట్ గా పిలిచి సుధీర్ ను ఆడుకున్న హైపర్ ఆది
అయితే.. జబర్దస్త్ లో తన స్కిట్ లో గెస్ట్ గా సుడిగాలి సుధీర్ ను పిలిచాడు హైపర్ ఆది. పిలిచిన తర్వాత స్టేజ్ మీద సుధీర్ పై హైపర్ ఆది వేసిన పంచులు మామూలుగా లేవు.
కలిసే వచ్చాం కదా. ఆలోచిస్తావు ఏంటన్నా.. అంటూ హైపర్ ఆది సుధీర్ ను అడగడంతో.. బుధవారం ప్రదీవ్ వేసుకుంటాడు… శుక్రవారం.. శ్రీను, రామ్ ప్రసాద్ వేసుకుంటారు.. గురువారం అయినా ఖాళీగా ఉందామంటే పిలిచి నువ్వు వేసుకుంటున్నావు అంటూ తెగ ఇరిటేట్ అవుతాడు సుధీర్.
దీంతో వెంటనే హైపర్ ఆది అందుకొని.. మూడు రోజులు మేము వేసుకునేవి చెప్పావు కానీ.. మిగితా నాలుగురోజులు నువ్వు వేసుకునేది చెప్పడం లేదు.. అంటూ హైపర్ ఆది అనేసరికి.. స్టేజ్ మీద నవ్వులే నవ్వులు.
కాదన్నా.. నీకంటూ ఏవైనా సిద్ధాంతాలు ఉన్నాయా? అంటూ హైపర్ ఆది అడగగా.. మనకు పెద్ద సిద్ధాంతాలు ఏవీ ఉండవురా. యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి.. పోయేవరకు పోరాడాలిరా.. అంటూ సుధీర్ చెప్పగా.. ఏదన్నా.. వాళ్లు ఇంటికి పోయే వరకా? వాళ్లే పోయే వరకా? అంటూ మరో పంచ్ వేస్తాడు హైపర్ ఆది. ఈగెటప్ లో జేమ్స్ బాండ్ లా ఉన్నా కదా.. సుధీర్ అంటే.. ఏంటో అన్నా.. నువ్వు ఏ డ్రెస్ వేసినా.. ఆ అబ్రకదబ్రలాగానే కనిపిస్తావు.. అంటూ సుధీర్ ఏం అన్నా దానికి సరైన పంచ్ వేసి సుధీర్ పరువును గంగలో కలిపేశాడు హైపర్ ఆది.
దానికి సంబంధించిన జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మీరు కూడా వాటిపై ఓ లుక్కేయండి.