Sudigali Sudheer: ప్రస్తుతం బుల్లితెర ప్రపంచంలో సుడిగాలి సుధీర్.. ఫాలోయింగ్ మామ్మూలుగా లేదు. ఆల్మోస్ట్ ఒక సినిమా నటుడికున్న ఫాలోయింగ్ ఇతగాడికుందంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ అది అక్షరాలా నిజం. మనం అనేకచోట్ల సుడిగాలి అభిమానులని చూడవచ్చు. Facebookలో అనేక పేజీలు సుధీర్ పేరుమీద నడుస్తున్నాయి అంటే అతని ఫాలోయింగ్ గురించి ఇక చెప్పుకోవచ్చు. అయితే దీనికంతటికీ ఒకటే ఒకటి కారణం.. అదే ‘జబర్దస్త్!’ ఈ షో వల్లనే సుధీర్ నేడు ఈ స్థాయిలో వున్నాడు.
Breaking: అసోం సీఎం బిశ్వశర్మపై తెలంగాణలో కేసు నమోదు
Sudigali Sudheer: హోటల్లో సుడిగాలి సుధీర్?
ఇక హోటల్లో సుడిగాలి సుధీర్ మేటర్ ఏమంటే, తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో ఒకటి విడుదలైంది. అందులో ఓ సీన్ చూసి అంతా ఒకింత ఆశ్చర్యపోయారు. సుడిగాలి సుధీర్ టీమ్ చేసిన స్కిట్లో గెటప్ శ్రీను, సుధీర్ సంభాషణ అదిరిపోయిందని చెప్పొచ్చు. సుధీర్‌తో గెటప్ శ్రీను ఈ విధంగా అంటాడు.. ‘నేను ఇచ్చిన 5000 ఏం చేశావ్?’ అని అడగ్గా.. దీనిపై సుధీర్ రియాక్ట్ అవుతూ..’ఆఫీస్ నుంచి తిరిగి వస్తుంటే ఓ అమ్మాయి లిఫ్ట్ అడిగింది. సరెకదాని లిఫ్ట్ ఇచ్చాను. అలా ఇద్దరం రోడ్డుపైన వెళ్తుండగా బోరున వర్షం కురిసింది!’ అని కొంచెం గాప్ ఇచ్చాడు…
Guppedentha Manasu Feb 16 Today Episode: జగతి, మహేంద్రలను అలా చూసి షాక్ అయ్యిన గౌతమ్.. ఇక వసుకి రోజాపువ్వు ఇచ్చిన రిషి!
వర్షం తరువాత?
మళ్ళీ సుధీర్ మాట్లాడుతూ.. ‘వర్షంలో ఇద్దరం తడిసిపోయాం. తడిసిపోయిన బట్టలతో అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేస్తే బాగోదని చెప్పి దగ్గరలో ఉన్న ఓ హోటల్లో రూమ్ తీసుకుని ఇద్దరం అక్కడ బట్టలు ఆరబెట్టుకున్నాం!’ అని అంటాడు. దాంతో అక్కడ వున్న గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, రష్మీ సహా రోజా అంతా ఫసుక్కున నవ్వుతారు. ఈ వీడియో తిలకిస్తున్న నెటిజన్స్ ‘హోటల్లో సుడిగాలి సుధీర్.. మధ్యలో అమ్మాయి’ అంటూ రకరకాలైన కామెంట్లు పెడుతున్నారు.