Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ అంటే చాలా మందికి ఇష్టం. తన కామెడీతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. ఇంకా ఆకట్టుకుంటూనే ఉన్నాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీల దగ్గర నుంచి చిన్న నటుల వరకూ సుధీర్ ని అమితంగా అభిమానిస్తారు. జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది కమెడియన్సు మన ముందుకు వచ్చారు. కొంత మంది తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోతే మరికొంత మంది అక్కడే పాతుకుపోయారు. ఆ కోవకు చెందిన వాడే సుడిగాలి సుధీర్. ప్రస్తుతం టీవీ షోలతో పాటుగా యాంకర్ గా పలు షోలను సుడిగాలి సుధీర్ చేస్తున్నాడు. అతను ఒక యాంకర్ మాత్రమే కాకుండా డ్యాన్సర్ కూడా. మెజిషియన్ గా కూడా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. తాను హీరోగా సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాను తీశాడు. ఇకపోతే సినిమాల్లో హీరోలకు స్నేహితుడిలా అనేక పాత్రలు చేశాడు. ఇప్పుడు సుడిగాలి సుధీర్ డేట్స్ దొరకాలంటే చాలా కష్టపడాలి. నెలలో 30 రోజుల పాటు సుధీర్ బిజీగానే ఉంటాడు.
జబర్దస్త్ కామెడీ షోతో పాటుగా ఇంకా అనేక షోస్ చేస్తూ వస్తున్నాడు. దీంతో సుధీర్ ఆస్తులు కూడా బాగానే పెరిగిపోయాయి. ఇప్పుడు సుడిగాలి సుధీర్ ఆస్తి విలువ చాలానే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ ఆస్తి చూస్తే దాదాపుగా 5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ కమెడియన్ సంవత్సరానికి కనీసం 35 నుంచి 45 లక్షల రూపాయల వరకూ సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జబర్దస్త్ షో, ఢీ ఛాంపియన్స్, పోవే పోరా, ఇంకా అనేక ఈవెంట్లు చేస్తుండటంతో చేతుల నిండా డబ్బుంటోంది. దానికితోడు ఈ మధ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో తన ఆస్తుల గురించి నోరు మెదిపాడు. హైదరాబాద్లోనే తనకు రెండు సొంతిళ్లు ఉన్నాయని తెలుస్తోంది. తాను ఈ మధ్య కొన్న ఓ ఇల్లు విలువ సుమారు 5 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. సుదీర్ కు సంవత్సరానికి కనీసం 40 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉండనుందని తెలుస్తోంది.
Hibiscus: మీ ఇంట్లో మందారం చెట్టు ఉందా..!? బంగారం ఉన్నట్టే.. ఈ విషయాలు తెలుసుకోండి..