Sugar : కొకైన్ కన్నా పంచదారనే ఎక్కువ:
పంచదారను వాడటం వలన మనం బరువు పెరుగుతాం. అంతే కాదు. పంచదారకు అడిక్ట్ చేసుకునే గుణం ఉందని మీకు తెలుసా? ఒక సర్వే లో తెలిపిన దాని ప్రకారం కొకైన్ కన్నా పంచదారనే ఎక్కువ అడిక్టివ్ గా ఉంటుంది అని నిర్ధారణ అయింది. అందుకే తీపి తినకుండా ఉండటం అంటే చాలా మందికి కష్టంగా ఉంటుంది. అలాంటి పంచదార కి బదులుగా కొన్ని
పదార్థాలను వాడి బరువును తగ్గించుకోవచ్చు.
బెల్లం: పంచదారకు కు బదులుగా బెల్లాన్ని వాడుకోవచ్చు. బెల్లంలో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. బెల్లం సహజ పద్దతిలో రక్త శుద్ధి చేయగలదు. జీవక్రియని మెరుగు పరచడం లో , కాలేయాన్నివిషరహితం గా చేయటంలోనూ, మలబద్దకాన్నితగ్గేలా చేయడం లో బెల్లం బాగా ఉపయోగపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలను కూడా బెల్లం తగ్గిస్తుంది. స్వీట్స్ ,పాలు ,కాఫీ ,టీ బెల్లం నీళ్లు(పానకం ),పెరుగులో బెల్లం కలుపుకు తినడం వంటివి చేయవచ్చు.
పటిక బెల్లం : మన పెద్దల కాలం నుండి పటిక బెల్లాన్ని వాడుతున్నారు. ఇది తియ్యగా పంచదార లాంటి రుచిని కలిగి ఉన్నాకూడా ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. ఇందులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీరాన్నిచల్లగా ఉంచడం తో పాటు హిమోగ్లోబిన్ ను కూడా పెరిగేలా చేస్తుంది. జ్యూస్, టీ, కాఫీ, స్వీట్స్ లాంటి వాటిలో దీనినివాడుకోవచ్చు.ఇది వరకు కాలం పుట్టిన కొన్ని రోజులనుండి కూడా పటికి బెల్లం నీళ్లు తాగించేవారు. అంటే ఇవి అంత సురక్షితం.
తేనె: తేనె నుండి లభించే పోషకాలను మానవ శరీరం పూర్తిగా గ్రహించగలదు. మీరు తియ్యగా కావాలి అని అనుకునే వాటిలో తేనెనువేసుకుంటే తేలికగా జీర్ణమవుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ల గుణాల తో ఉండే తేనె షుగర్ బదులుగా వాడుకోవచ్చు. అలా వాడడం వలన గుండె ఆరోగ్యాంగా, మెదడు చురుకుగా గా, బాడీని ఫిట్ గా ఉండేలా చేస్తుంది. వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటేచాలా తేలికగా బరువు తగ్గుతాం అన్నవిషయం మనందరికీ తెలిసిందే.