Good Days: మీకు  మంచి రోజులు రాబోతున్నాయి అని తెలిపే సూచనలు ఇవే!!

Share

Good Days: సాక్షాత్తు అమ్మవారు
మన గుమ్మం ముందుకు ఎవరన్నా వచ్చి అన్నం పెట్టమని అడిగినారంటే, మనకు పుణ్య కాలం,కలిసివచ్చే కాలం రాబోతుంది అని అర్ధం.  భగవంతుడు ఎవరి  ద్వారానో  మీకు పుణ్య ఫలమును  అందించడానికి ఎవరినో పంపించారు అని అర్ధం. ఆ భాగ్యాన్ని మనం కచ్చితం గా  వినియోగించుకోవాలి.    ఒక గోమాత   ఇంటి ముందుకు వచ్చింది అంటే సాక్షాత్తు అమ్మవారు వచ్చినట్టే.  వెంటనే దానికి కాస్త గడ్డి లేదా  అన్నం కాని  పెట్టాలి. పిలవక కుండా అనుకోకుండా    ఒక సన్న్యాసిలేదా ఒక శ్రీవిద్యోపాసకుడు కానీ , ఒక భాగవతుడు కానీ , ఒక వేదమూర్తి కానీ , నీ ఇంటికి  వచ్చారు అంటే కొన్ని కోట్ల జన్మల పాపం నిన్ను వీడి పోతుంది.ఏమో ఎవరు ఏ రూపం లో ని ఇంటికి వస్తారో తెలియదు.

Good Days: నీ కర్మలు  తొలిగించడానికి

యోగులు గా ఉన్నవారుజ్ఞానులైనవారు , బాబాలు అన్నం తిన్న ఇంట ఉన్న   పాపాలను వారితో తీసుకుని    వెళతారు.  తనను నమ్మిన  భక్తుల ఆకలి తీర్చినందులకు భగవంతుడు ఎంతో సంతోష పడి ..  వెంటనే తగు పుణ్యమును మనకు ప్రసాదిస్తారు.  దానితో మన పాప రాశి దగ్ధం అవుతుంది. భగవంతుడు మహానుభావుల బుద్ధి ప్రచోదనం  చేసి నీ కర్మలు  తొలిగించడానికి, వారు నీ ఇల్లు వెతుక్కుంటూ వస్తారు.నీవు పెట్టె కాస్త  అన్నంతో (Rice)  నీ జన్మ జన్మల నుండి మోసుకువస్తున్నా పాపాన్ని అంతా వాళ్ళు పోగొడతారు. నీవు పెట్టె  కాస్త అన్నం ఎక్కడ దొరకక  వారు నీ  ఇంటికి  రారు.కేవలం ని ఉద్దరణ కోసమే ని ఇంటికి వస్తారు.  ఒక్కసారి అవకాశం జారవిడుచుకుంటే, నీవు రమ్మని బ్రతిమలాడినా వారు ఇక  రారు. వారు వచ్చిన సమయాన్నే నువ్వు వినియోగించుకోవాలి.

 ఆశ్వీరదించి మరి వెళ్తారు

ఒకసారి కాదనుకుంటే కావాలన్నా  మరలా తిరిగి రాదు ఆ అవకాశం. ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా  నీవు పెట్టిన ఒక్క అరటి పండుతో నీ పాపాలు అన్నీ  పోగొడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించు. అమ్మా.. కాస్త  అన్నం పెట్టు తల్లీ అని అడిగినవారికి  లేదనకుండా నీదగ్గర ఏమి ఉంటే అది పెట్టు.    నీ తరతరాలను ఆశ్వీరదించి మరి వెళ్తారు. అందుకే  ,  అమ్మా అన్నం పెట్టు …అని అడిగిన వారికి  ఎన్ని పనులున్నాపరిగెత్తుకొని  వెళ్లి అన్నం  పెట్టాలి.


Share

Related posts

Crime: హైదరబాద్ అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త : అమ్మాయిలే టార్గెట్ గా సిటీ లోకి ఒక గ్యాంగ్ దిగింది ..

Naina

Corona: తెలంగాణ‌లో క‌రోనా … రెండు వార్నింగ్ వార్త‌లు

sridhar

‘టిక్ టాక్’ పోయిందని సంతోషించేలోపు ఇంకో దరిద్రం వచ్చేసింది!

Muraliak