Suhana Khan : సోషల్ మీడియా పుణ్యమా అని సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు స్టార్ కిడ్స్.. వారు చేసే పోస్టులకు నెటిజన్లు ఫిదా అవుతూ ఉంటారు.. ఆ పోస్టులకి లైక్ , షేర్ తో పాటు కామెంట్ కూడా జత చేస్తున్నారు.. కొన్ని కామెంట్స్ నార్మల్ గానే ఉన్నా కొన్ని కామెంట్స్ మాత్రం వారిని స్పందించేలా చేస్తున్నాయి.. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది.. ఈ అమ్మడు పోస్టులకి నెటిజన్లు ఫిదా అవుతుంటారు.. రీసెంట్ గా షేర్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.. ఈ ఫోటో పై వచ్చిన కామెంట్స్ పై భిన్నంగా స్పందించింది సుహనా ఖాన్..
ఈ బ్యూటీ ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 1.5 మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకుంది.. suhana khan రెగ్యులర్ గా తన హాట్ అండ్ ఫ్యాషన్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా ఆమె కలర్ పై వస్తున్న ట్రోల్స్ పై ఆమె స్పందించింది.. బ్రౌన్ కలర్ లో కనిపించే సుహానా స్వయంగా తనపై వస్తున్న ట్రోల్స్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి, వాటిని చేస్తున్న వారికి సున్నితంగా కౌంటర్ ఇచ్చింది.. సుహనా కొన్నాళ్ల క్రితం చాలా నల్లగా కనిపించేది. తెల్లగా కనిపించడం కోసం ఆమె ఆపరేషన్ చేయించుకుంది. దాంతో ఆమె అందంగా కాకుండా అబ్బాయి గా మారిందని కొందరు నవ్వుతూ, అప్పుడే బాగున్నావ్.. ఇప్పుడు అందంగా కనిపించడం లేదు.. అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు.. దీనిపై సుహనా ఈ విధంగా స్పందించింది..
చిన్నతనం లో ఉన్నప్పుడు ఒకలా పెద్దయిన తర్వాత మరోలా ఉండటం కామన్.. అబ్బాయి అయినా అమ్మాయి అయినా చిన్నప్పుడు ఒక లాగా ఉంటారు . పెద్ద అయిన తర్వాత మార్పులు వస్తాయి. ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్ చేయడం ఏమాత్రం సబబు కాదు అని తెలిపింది. పన్నెండేళ్ళ వయసులో నా స్కిన్ టోన్ వల్ల నేను కాస్త ఎబ్బెట్టుగా ఉన్నా. ఇప్పుడు నాలో మార్పు వచ్చిందని ఆమె తెలిపింది. తన కలర్ పై వస్తున్న ట్రోల్స్ కు సుహనా ఇచ్చిన కౌంటర్ తో అయినా ట్రోల్స్ ఆగిపోతాయెమో చూడాలి మరి.