సుకుమార్ లెక్కలో ఏదో తేడా కొడుతుంది.. లేకపోతే పుష్ప లో ఆ సీనియర్ హీరో ఏంటీ ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ‘పుష్ప’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవూ మేకర్స్ నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇక రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాలి, అందుకే అడవిలోనే ఎక్కువ భాగం షూట్ చేయాలని సుకుమార్ ప్లాన్.

Fans decode Allu Arjun's Pushpa posters and discover hints | Telugu Movie News - Times of India

ఇందుకోసం కేరళ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాడని అంటున్నారు. లాక్ డౌన్ కి ముందు కేరళ లో షెడ్యూల్ ప్లాన్ చేసిన సుకుమార్ కరోనా తో క్యాన్సిల్ చేసి వచ్చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో తమిళ మాజీ హీరో మాధవన్ పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. వాస్తవంగా ఈ క్యారెక్టర్ నే ముందు విజయ్ సేతుపతి తో చేయించాలనుకున్నాడు సుకుమార్. అయితే మాధవన్ ని సెలెక్ట్ చేసుకున్నాడంటే ఖచ్చితంగా ఈ లెక్కల మాస్టారు లెక్క వేరే ఉంటుందని చెప్పుకుంటున్నారు.

R Madhavan: Kangana in my opinion is extremely educated | Hindi Movie News - Times of India

ఇక ఈ సినిమా షూటింగ్ నవంబర్ 20 నుండి ప్రారంభం కాబోతుండగా… ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ప్లేస్ లో భారీ సెట్స్ నిర్మిస్తున్నారని.. ఈ ఈ సెట్స్ లో సాంగ్స్ మాత్రమే చిత్రీకరిస్తారని తెలుస్తుంది. నవంబర్ నుంచి ఈ సెట్స్ లోనే అల్లు అర్జున్ – రష్మిక పై రెండు సాంగ్స్ ను తీయబోతున్నారని తెలుస్తోంది.

అంతేకాదు ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉన్న సంగతి తెల్సిందే. ఈ సాంగ్ కోసం బాలీవుడ్‌ హీరోయిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ఇంకా ఎవరు సెట్ కాకపోవడంతో… పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండా కాంబినేషన్ లో రాబోతున్న ఫైట లో హీరోయిన్ అనన్య పాండేను ఫైనల్ చేసే ప్లాన్ లో ఉన్నారని సమాచారం.