Sukumar : సుకుమార్ Sukumar టాలీవుడ్ లో అంతకంత తన ఇమేజ్ ని పెంచుకుంటూ వెళుతున్నాడు. ఇంతకాలం స్టార్ డైరెక్టర్ గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుకుమార్ రైటింగ్స్ అన్న బ్యానర్ లో మీడియం బడ్జెట్ సినిమాలని నిర్మిస్తున్నాడు. ఇలా తన దగ్గర అసోసియేట్స్ గా ఉన్న వాళ్లని దర్శకులుగా మార్చి లైఫ్ ఇస్తున్నారు. కుమారి 21 ఎఫ్ తో పలనాటి సూర్య ప్రతాప్ ని దర్శకుడిగా మార్చి మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకునే అవకాశం ఇచ్చాడు. ఇక రీసెంట్ గా మరో అసోసియేట్ కి అవకాశం ఇచ్చి ఏకంగా స్టార్ డైరెక్టర్ ని చేసేశాడు.
ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు ని స్టార్ డైరెక్టర్ గా చేయడంతో సుకుమార్ ని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసలతో ముంచేస్తున్నారు. తనలాంటి వాళ్ళని ఇండస్ట్రీకి ఇస్తుండటంతో అందరి మనసులను గెలిచాడు. ఈ క్రమంలో సుకుమార్ మరో దర్శకుడిని పరిచయం చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే పుష్ప లాంటి భారీ పాన్ ఇండియన్ సినిమాని చేస్తునే వేరే హీరోలతో వేరే దర్శకులతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు.
Sukumar : కార్తికేయ చావుకబురు చల్లగా అన్న సినిమా చేస్తున్నాడు.
త్వరలో ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై విభిన్నమైన సినిమాలను చేస్తూ హీరోగా పాపులారిటీ ని సాధించుకుంటున్న కార్తికేయ తో సినిమా చేయబోతున్నట్టు లేటెస్ట్ న్యూస్. ఈ సినిమాని జీఏ2 – సుకుమార్ రైటైంగ్స్ కలిసి నిర్మించబోతున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఇదే బ్యానర్ లో ప్రస్తుతం కార్తికేయ చావుకబురు చల్లగా అన్న సినిమా చేస్తున్నాడు. పెగళ్ళపాటి కౌశిక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత లేటెస్ట్ సినిమా సెట్స్ మీదకి రానుందని సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన అప్డేట్ రానుందని తెలుస్తోంది.