Pushpa: మొన్న అనగా, డిసెంబర్ 17, శుక్రవారంనాడు విడుదలైన పుష్ప భారీ వసూళ్లనే రాబడుతోంది. ఒక్క రోజులోనే దాదాపు 80 కోట్ల షేర్ వసూలు చేసిందని భోగట్టా. కాకపోతే టాక్ విషయంలోనే కొంచెం నిరాశ పరిచింది. కానీ, క్రిటిక్స్ మాత్రం సినిమాను తెగ పొగిడేస్తున్నారు. సుకుమార్ స్క్రీన్ప్లే అదుర్స్ అంటూ కితాబిస్తున్నారు. ఈ క్రమంలో పార్ట్ 2 ఉంటుందో లేదో అని అంతా అనుమానాన్ని వ్యక్తం చేసారు. అయితే అందరి అనుమానాలు తలకిందులు చేస్తూ.. సుక్కు పుష్ప పార్ట్ 2 రిలీజు డేట్ ని ప్రటించేసాడు.
Herbal Tea: ఈ సీజన్లో వచ్చే అనేక రకాల ఆరోగ్య సమస్యలకు ఈ టీ తో చెక్..!!
పుష్ప రిలీజ్ డేట్ అప్పుడే..
అవును.. ‘పుష్ప ది రూల్’ అనే పేరుతో పార్ట్ 2 రిలీజ్ అవ్వబోతుంది. పార్ట్ 1 చూసిన అభిమానులు ‘పుష్ప’ పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. సుకుమార్ తాజాగా మాట్లాడుతూ, ‘పుష్ప’ పార్ట్ 2 షూటింగ్ 10 శాతం పూర్తి అయిందని, మొదటి పార్ట్ చేసేటప్పుడే కొన్ని సన్నివేశాలని చిత్రీకరించామని అన్నారు. మిగిలిన షూటింగ్ ఫిబ్రవరిలో మొదలుపెట్టి వచ్చే ఏడాదికి సరిగ్గా ఇదే సమయానికి పుష్ప పార్ట్ 2 రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బన్నీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Pushpa: పార్ట్ 2 లేదా పుష్పా?
పార్ట్ 2 ఎలా ఉండబోతుంది?
పార్ట్ 1 రిజల్ట్ తరువాత సుకుమార్ కాస్త డీలా పడినా పార్ట్ 2తో సమాధానం చెబుతా అంటున్నాడు. పార్ట్ 2లో ఫాహిద్ ఫాజిల్ పాత్రను ఓ రేంజ్ లో ఎలివేట్ చేయనున్నాడట. ఇక నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో సుకుమార్ అసలు కథ పార్ట్-2లోనే వుంది.. అంతవరకూ కాస్త వెయిట్ చేయండి అని సదరు విలేఖరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడట. దాంతో అందరూ పార్ట్ 2 మరో లెవల్లో ఉంటుంది అని అనుకుంటున్నారు.