టాలీవుడ్ లో అగ్ర క్యారెక్టర్ ఆర్టిస్టుల లో బ్రహ్మాజీ ఒకరు. తెర పైన అతను ఎంతో సరదాగా యాక్టివ్ గా ఉంటారు. బయటకూడా కౌంటర్లు సెటైర్లు వేయడంలో బ్రహ్మాజీ స్టైల్ వేరే. అప్పుడప్పుడు అతను వేసే ట్వీట్లు, పోస్టులు వివాదాలకు కూడా దారి తీస్తుంటాయి. కొద్ది రోజుల క్రితం కూడా అతను ట్విట్టర్ నుండి వెళ్ళిపోయాడు. ఇక ఇలాంటి బ్రహ్మాజీ బుల్లితెరపై ఏదైనా షో లో కనిపించినా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
ఇక సుమా హోస్ట్ గా వస్తున్న బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఈ వారం అలీ, బ్రహ్మాజీ గెస్ట్ లు గా వచ్చారు. దీనికి సంబంధించిన ఒక ప్రోమో బయటకు వదిలారు. ఇందులో అందరూ కలిసి బ్రహ్మాజీ ని ఒక రేంజ్ లో ఆడుకునారు. మొత్తానికి సుమ, అలీ కలిసి అతని పరువు పూర్తిగా తీసేశారు.
స్టార్ కమెడియన్ అలీ వచ్చీరావడంతోనే సుమ పై పంచులు వేసాడు. లాక్ డౌన్ గురించి చెబుతూ ఇంట్లోనే ప్రతిరోజు ఒక ఛాలెంజ్ లాగే గడిచింది అంటూ సెటైర్ వేశాడు. తర్వాత బ్రహ్మాజీ సింపుల్ స్టెప్పులతో డాన్స్ వేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే సుమ ఎవరైనా డాన్స్ చేస్తే కాలు లేదా చేయి షేక్ అవుతుంది… కానీ బ్రహ్మాజీ స్టెప్పులు వేస్తే అతని వయస్సు వల్ల బాడీ మొత్తం షేక్ అవుతుంది అని పంచ్ వేసింది.
తర్వాత బ్రహ్మాజీ, అలీ స్టేజి పైన డ్యాన్స్ చేయడానికి వచ్చారు, అప్పుడు బ్రహ్మాజీ వీణ స్టెప్ వేస్తుంటే పక్కన ఉన్న మైక్ తీసుకుని విచిత్రమైన సౌండ్ చేయడంతో బ్రహ్మాజీ ని చూసి అందరూ పగలబడి నవ్వారు. అందరి ముందు అలీ బ్రహ్మాజీ పరువు తీసేసాడు అని చెప్పాలి.
pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాన్…
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…