మోనల్ గజ్జర్.. ఈమె గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మోనల్ గజ్జర్ పేరు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి మారుమోగిపోతోంది. తను ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిందో… అప్పుడే తను పెద్ద సెలబ్రిటీ అయింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి ముందు తను చాలా సినిమాల్లో నటించినా కూడా తనకు అంత పేరు రాలేదు కానీ.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లగానే మంచి పేరొచ్చింది.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే.. మోనల్ కు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అల్లుడు అదుర్స్ లో చాన్స్ వచ్చింది. ఆ సినిమాలో ఒక రోల్ చేసింది మోనల్. అయితే.. సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఓరోజు షూటింగ్ టైమ్ లో మోనల్ ఏడ్చిన విషయం గురించి చెప్పుకొచ్చింది.
యాంకర్ సుమ.. మోనల్ ను అడిగింది. ఓరోజు షూటింగ్ లో ఏడ్చావట.. ఎందుకు అని. ఆరోజు నిజంగా షూటింగ్ లో పాల్గొనలేకపోయాను. డ్యాన్స్ షూట్ ఉంది. కానీ.. నాకు మాత్రం కన్నీళ్లు ఆగడం లేదు. ఆ రోజు మా నాన్న చనిపోయిన రోజు. ఆయన గుర్తొచ్చి తెగ ఏడ్చేశా. మరోవైపు షూటింగ్ సమయం అయిపోతోంది. దీంతో శేఖర్ మాస్టర్ చాలా సింపుల్ స్టెప్స్ నేర్పించారు. దీంతో వెంటనే ఆ స్టెప్స్ నేర్చుకొని చేశా.. అంటూ చెప్పుకొచ్చింది మోనల్. మోనల్ ఎంతైనా చాలా సెన్సిటివ్.. అని తెలుగు ప్రేక్షకులకు ముందే తెలుసు కదా.