తెలుగునాట చాలా మంది యాంకర్లు వున్నా అందులో సుమ ప్రత్యేకం. ప్రస్తుతం ఎంతో మంది బుల్లితెర యాంకర్లు ఉన్నప్పటికీ టాప్ యాంకర్ గా కొనసాగుతోంది సుమ. దానికి కారణం ఆమె నటనా కౌశలం.. మాటలు.. చిరునవ్వు..! ఆమె చేసే ప్రతి ఈవెంట్స్, బుల్లితెర కార్యక్రమాల్లో సమయస్ఫూర్తి తో నడుచుకుంటూనే.. బాధ్యతాయుతంగా మెలిగి వాటిని సక్సెస్ చేస్తారు సుమ.
అందుకే, ఆమెకు చాలా ఆఫర్లు వస్తూనే ఉంటాయి. బుల్లితెర పై ఆమె చేసే ప్రోగ్రాంల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే.. సుమ అంటేనే ఆ ప్రోగ్రామ్ టాప్ రేటింగ్ కొనసాగుతూ దుమ్మురేపుతుంది. ఈ నేపథ్యంలో నే ఆమె రెమ్యూనరేషన్ సైతం భారీ మొత్తంలో ఉంటోంది. సాధారణంగా ఏదైనా కార్యక్రమానికి, సినిమా ఫంక్షన్లకు వ్యాఖ్యాతగా చేయడానికి సుమ.. ఒకటి నుంచి రెండు లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్.
అయితే, రెగ్యులర్ ప్రోగ్రామ్స్ కు మాత్రం ఇంకా భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటారట సుమ. అయితే, ఆమె భర్త, ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల మీకు తెలిసే వుంటారు. ఎందుకంటే, వెండితెరపై ఆయన పోషించిన పాత్రలు అలాంటివి మరి. పలు ఇంటర్వ్యూ లలో.. మీ సంపాదన కంటే సుమ సంపాదన ఎక్కువ కదా..! దానిపై మీ ఫీలింగ్స్ ఏంటి అని ప్రశ్నలు అడగ్గా.. ఎక్కువగా ఉంటే ఏముంది అంటూ కూల్ సమాధానం చెప్పేసేవారు.
అయితే, ఇప్పటికీ రాజీవ్ కనకాలను ఇదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూలలో అడుగుతూనే వున్నారు. దీనిపై తాజాగా స్పందించిన ఆయన ఈ సారి కాస్త డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చారు. ” సుమ సంపాదన కంటే నా సంపాదనే ఎక్కువ. ఎలాగంటే, మొదట్లో నేను చాలా సంపాదించి.. ఆస్తులు కూడబెట్టాను. వాటితో పోలిస్తే నాదే కదా ఎక్కువ”అన్నారు రాజీవ్ కనకాల. కాగా , ప్రస్తుతం ఆయన జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ ఆర్ ఆర్” చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.