Suma Kanakala: ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’ లోకి ఎక్కిన యాంకర్ సుమ… దానికి కారణం ఇదే!!

Suma Kanakala : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితమయిన పేరు యాంకర్ సుమ కనకాల – Suma Kanakala. ఆమె గురించి మన అందరికి తెలిసిందే. ఆమె పుట్టింది కేరళ లోనే అయినా ఆమె తన కెరీర్ ను  తెలుగు లో ప్రారంభించి తెలుగు ప్రేక్షకుల మన్ననను పొందారు. ప్రస్తుతం ఆమెకు రెండు తెలుగు రాష్ట్రాలలో లక్షల మంది అభిమానులు ఉన్నారు. అలాగే ఏదైనా సినిమా ఈవెంట్ ఉంది అంటే నిర్వాహకులకు ముందుగా గుర్తు వచ్చే పేరు సుమ కనకాల.

 

Suma Kanakala enters Limca Book of Records
Suma Kanakala enters Limca Book of Records

ఇప్పటికే ఆమె కొన్ని వందల ఈవెంట్స్ కి వ్యాఖ్యాతగా పనిచేశారు. ఆమెకు ఉన్న క్రేజ్ ముందు ఎంత మంది కొత్త యాంకర్స్ వచ్చినా సరే సుమ పాపులారిటీ ఏమాత్రం తగ్గడం లేదు. ఈవెంట్ ఏది అయినా అక్కడ సుమ కనకాల కచ్చితంగా ఉండాలని ఆమెకు లక్షల రెమ్యునరేషన్ ఇచ్చి మరీ వారి ఈవెంట్స్ లో ఆమెతో యాంకరింగ్ చేయిస్తున్నారు చిత్ర నిర్మాతలు. 

 

ప్రస్తుతం ఈటీవి ఛానల్ లో ప్రసారమవుతున్న స్టార్ మహిళ షో ద్వారా సుమ ఎంతో మందిని తన షో కి పరిచయం చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. తన వాక్చాతుర్యంతో ఈ షోను పాపులర్ చేసింది యాంకర్ సుమ. స్టార్ మహిళ షో ఇప్పటికే వేల ఎపిసోడ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. అయితే ఈ షోకి గాను యాంకర్ సుమ ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’(Limca Book of Records) లోకి ఎక్కింది. దీనితో పాటు సుమ కనకాల ఈటీవి లో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్‌ను కూడా చాలా సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇక కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్  సమయంలో సుమ కనకాల సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటూ తన అభిమానులకు  మరింత చేరువయ్యారు.

 

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్  అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.