Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లో సుమ పంచ్ డైలాగులు..కాజల్ కి ఊహించని ప్రశ్న సుమ..!!!!

Share

Bigg Boss Telugu 5: దీపావళి స్పెషల్ బిగ్ బాస్ (Bigg Boss) ఎపిసోడ్ ఆడియన్స్ నీ ఎంతగానో ఎంటర్ టైన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో హౌస్ లోకి యాంకర్ సుమ వచ్చి బిగ్ బాస్(Bigg Boss) ఇంటి సభ్యులపై.. తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ.. హౌస్ లో నవ్వులు పూయించింది. బిగ్ బాస్ భార్యగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సొంత ఇంటి సభ్యులతో ఒక గాజు గ్లాస్ లో ఉండి మాట్లాడటం జరిగింది. ముందుగా ఇంటి సభ్యులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సుమ బిగ్ బాస్ (Bigg Boss) షో లో… ఉన్న 12 మంది కంటెస్టెంట్ ల ఆట తీరు గురించి తనదైన శైలిలో డైలాగులు చేసింది. యాంకర్ రవి ఏదో లోకంలో ఉన్నాడని ఈవారం ఆట తీరు సరిగాలేదని.., మేము చూసిన యాంకర్ రవి(Anchor Ravi) గారు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రవి వేరు.. అంటూ సుమ డైలాగ్ వేయడంతో.. హౌస్ లో రియల్ రవి ని మీరు చూస్తున్నాడు అంటూ రవి కౌంటర్ ఇచ్చాడు. ఇదే తరుణంలో బాగా ఆడాలని సుమ తెలియజేయడం మాత్రమే కాక ఎంటర్టైన్మెంట్.. ఆశించిన విధంగా నీ నుండి రావడం లేదని… అనటంతో రానున్న రోజుల్లో యాంకర్ రవి మళ్లీ చూస్తారని తెలియజేయడం జరిగింది.

ఇక ఇదే తరుణంలో షణ్ముఖ్(Shanmukh), సిరి(Siri)..మోజో రూమ్ లో… మాట్లాడుకోవటం మాత్రమేకాక కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవటం వంటివాటిపై సుమా(Suma) సెటైర్లు వేశారు. కేవలం ఫ్రెండ్షిప్ పరంగా మాత్రమే ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు.. వేరే ఉద్దేశం లేదని.. సిరి పేర్కొంది. షణ్ముఖ్ (Shanmukh) టాస్క్ లో… ఎందుకు అస్తమానం వెనకాలనుంచి ఉంటావు సెట్టింగ్ స్టార్… అంటూ సెటైర్లు వేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే అస్తమానం షణ్ముక్ వెనకాల తిరగడం వెనక అసలు ఉద్దేశం ఏమిటి అని సిరిని యాంకర్ సుమ(Suma) ప్రశ్నించి సెటైరికల్ కామెంట్లు చేయడం జరిగింది. అనంతరం పింకీ నీ… ఉద్దేశించి అసలు నువ్వు గేమ్ ఆడటానికి వచ్చావా మానస్ నీ .. సపోర్ట్ చేయడానికి వచ్చావా..? అంటూ ప్రశ్నించడం జరిగింది. దీంతో గేమ్ ఆడటానికి వచ్చాను అంటూ పింకీ బదులిచ్చింది. ఇక ఇదే తరుణంలో ఒకవేళ హౌస్లో నువ్వు మానస్ మాత్రమే మిగిలి ఉంటే.. ట్రోఫీ ఎవరికి ఇస్తావ్.. అంటే గేమ్ గేమే అక్క… ట్రోఫి గెలుచుకోవటానికి వచ్చాను..అని పింకీ(Pinky) ఆన్సర్ ఇచ్చింది.

Bigg boss telugu5: సిరి షన్ను ముద్దులు, కాజల్ గొడవలు, మానస్ కి పింకీ సేవలు,  కంటెస్టెంట్స్ తాటతీసిన సుమ | bigg boss telugu 5 anchor suma enters as lady  boss to the house

ఇంటిలో బాంబులు వెయ్యడం

ఇక లోబో(Lobo) ఇంటిలో బాంబులు వెయ్యడం పై తనదైన శైలిలో సుమా పంచ్ డైలాగులు వేయడం జరిగింది. ఇక ఇదే తరుణంలో సన్నీ(Sunny) ఆటతీరుపై కూడా తనదైన శైలిలో సెటైర్లు వేసింది. యానీ మాస్టర్ ఆటతీరుపై సుమన్ మాట్లాడుతూ బయట మీరు ఆ రోజు “వేటాడు వెంటాడు” టాస్క్ లో… స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చిన ఎటువంటి మంత్రాలు చదివారు అంటూ ప్రశ్నించారు. దానికి యానీ మాస్టర్ స్పందించి.. గెలవడం కోసం దేవుడికి ప్రార్థించాను అని జవాబిచ్చింది. ఆ తర్వాత పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుంది అని డైలాగు వేశారు. ఇంతకీ పందులు ఎవరు అని … యాంకర్ సుమ ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలో యానీ మాస్టర్ హౌస్లో గుంపులుగా గేమ్ ఆడిన వాళ్ళు అని తనదైన శైలిలో జవాబిచ్చింది. సింగర్ శ్రీరామ్ చంద్ర(Sri Ram Chandra) నుద్దేశించి.. బయట మీరు బోలేడని పాటలు పాడే వాళ్ళు…హౌస్ లో.. ఎందుకు పాడటం లేదు.

కాజల్ గొడవలు పెట్టుకోవడానికా..?

కేవలం బాత్ రూమ్ దగ్గర మాత్రమే పడుతున్నట్లు అనిపిస్తుంది. మీరు పడక పోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నించారు. దానికి శ్రీ రామ్ చంద్ర.. అటువంటిదేమీ లేదు ఖచ్చితంగా పాడతాను అని బదులిచ్చరు. ఆ తర్వాత జెస్సీ గురించి మాట్లాడుతూ… అద్భుతంగా గేమ్ ఆడుతున్నాను ఇంకా బాగా ఆడు. ఈమధ్య చాలా స్లో అయిపోయావు. కొంచెం ఎనర్జిటిక్ గా ఆడు… ఈ లోకంలో ఉండు.. అన్న రీతిలో సుమ సెటైర్లు వేశారు. ఇక ఇదే తరుణంలో కాజల్ గొడవలు పెట్టుకోవడానికా..? లేకపోతే పెట్టడానికా..? నీ స్ట్రాటజీ లు అంటూ తనదైన శైలిలో సుమ.. ప్రశ్నించగా కేవలం గేమ్ ఆడటానికి మాత్రమే వచ్చినట్లు.. కాజల్ సమాధానమిచ్చింది. ఈ రీతిగా సుమా హౌస్ లో దీపావళి ఎపిసోడ్ లో .. ఇంటి సభ్యుల పై సెటైర్లు వేయడం జరిగింది.


Share

Related posts

చాలా తేలికగా  చేసుకునే ఈ జ్యూస్ తాగితే,  మీ మొఖం ధగ ధగ మెరిసిపోతుంది !

siddhu

గుంటూరు కర్నూలు లో అత్యదికంగా కరోనా కేసులు 35 నమోదు అయ్యాయి..

Siva Prasad

Nani : నాని మీద చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారట..!

GRK