Sumakka : సుమక్క గురించి తెలుసు కదా. యాంకర్ సుమ యాంకరింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ సుమ దశాబ్దాల నుంచి తెలుగు బుల్లితెరను ఏలేస్తోంది. ఎంతైనా యాంకర్ సుమ యాంకర్ సుమే. సుమక్క ఏ షోకు యాంకరింగ్ చేసినా ఆ షో సూపర్ హిట్ అయినట్టే. తన స్పాంటెనిటీ, తన కామెడీ టైమింగ్, టైమింగ్ పంచులు మామూలుగా ఉండవు.

తెలుగు బుల్లితెర మీద సుమక్కను బీట్ చేసేవాళ్లు ఇప్పటి వరకు రాలేదు. ఎంతమంది కొత్త యాంకర్లు వచ్చినా…. సుమక్కను బీట్ చేసేవాళ్లే లేరు అనడంతో అతిశయోక్తి లేదు.
Sumakka : జబర్దస్త్ పరదేశి యూట్యూబ్ చానెల్ లో సుమక్క
సుమ దగ్గర యాంకరింగ్ నేర్చుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. సుమ చెప్పే టిప్స్ కోసం వెయిట్ చేసేవాళ్లు కోకొల్లలు. కానీ… ఆ అదృష్టం జబర్దస్త్ పరదేశికి దక్కింది. జబర్దస్త్ పరదేశి.. సుమక్కను తన యూట్యూబ్ చానెల్ కు పిలిచి.. యాంకరింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు పరదేశి.
యాంకరింగ్ అంటే ఒకరు నేర్పించేది కాదు… అది లోపల నుంచి రావాలి.. యాంకరింగ్ అనేది స్పాంటెనిటి… దాన్ని ఎవ్వరూ నేర్పించరు… అంటూ సుమక్క… జబర్దస్త్ పరదేశికి బాగానే పంచ్ లు వేసింది.
మొత్తానికి సుమక్క మామూలు మహిళ కాదు. మేడమ్ సార్ మేడమ్ అంతే… అంటూ జబర్దస్త్ పరదేశి తన యూట్యూబ్ వీడియోలో చెప్పేశాడు. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.