ట్రెండింగ్ న్యూస్

యాంకర్ సుమను అక్క అనేసిన రేణు దేశాయ్.. వెక్కివెక్కి ఏడ్చిన సుమ?

sumakka with renu desai in her youtube show
Share

రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ మాజీ భార్యలానే ఉండిపోలేదు. తనకంటూ ప్రత్యేకంగా ఓ ఐడెంటిటీని తెచ్చుకోవడం కోసం తెగ కష్టపడుతోంది. తెలుగులో కొన్ని షోలలో జడ్జిగానూ వ్యవహరించింది. సోషల్ మీడియాలో రేణు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. ఇక.. తన ఫ్యామిలీ విషయాలను కూడా ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది రేణు.

sumakka with renu desai in her youtube show
sumakka with renu desai in her youtube show

అయితే.. తాజాగా రేణు దేశాయ్.. సుమక్క యూట్యూబ్ చానెల్ లో ఈట్ టాక్ విత్ సుమక్క అనే ప్రోగ్రామ్ కు గెస్ట్ గా వచ్చింది.అసలే యాంకర్ సుమ.. ఇంకొకరిని మాట్లాడించే రకం కాదు. తనే గలగలా మాట్లాడేస్తుంది. కానీ.. రేణు దేశాయ్ మాత్రం సుమక్కనే ఏడిపించేసింది. సుమ కన్నా చాలా బాగా తెలుగులో మాట్లాడుతూ షోను ఎక్కడికో తీసుకుపోయింది.నువ్వు నా అక్కవు. నిన్ను అక్కా అని పిలుస్తా. నా పిల్లలు నిన్ను పెద్దమ్మ అని పిలుస్తారు.. అని అనగానే సుమ మాత్రం వెంటనే ఏడుపు మొహం పెట్టింది. నేను నీకు అక్కనేంటి.. నువ్వే నాకు అక్కవు.. అంటూ చెప్పేసింది.

మొత్తం మీద వీళ్ల రచ్చ మాత్రం అదిరిపోయింది. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోగ్రామ్ లో రేణు కూతురు ఆధ్య కూడా పాల్గొన్నది. అయితే.. ఆధ్యను ప్రోమోలో చూపించలేదు కానీ.. ఫుల్ ఎపిసోడ్ వచ్చినప్పుడు చూపిస్తారు కావచ్చు. అప్పటి వరకు ఈ ప్రోమోను అయితే చూసి ఎంజాయ్ చేయండి.


Share

Related posts

AP SEC : జగన్ కి చుర్రుమనేలా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో మెలిక పెట్టిన ఎస్ఈసీ!మేటరేంటంటే?

Yandamuri

ఉగ్రదాడి చేసింది మేమే:ఐసిస్

somaraju sharma

Balakrishna : బాలకృష్ణ కోసం క్యూ పెరిగిపోతోంది.. ఎంతమంది డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారో చూడండి ..!

GRK