ఆలీతో సరదాగా.. ఈటీవీలో వస్తున్న ఈ ప్రోగ్రామ్ ప్రస్తుతం విజయవంతంగానే సాగుతోంది. సినిమా సెలబ్రిటీలను గెస్టులుగా పిలిచి.. వాళ్ల మనసులోని మాటలను ప్రేక్షకులతో పంచుకునేందుకు రూపొందించిన ప్రోగ్రామ్ ఇది. ఈ షోకు ఆలీ కరెక్ట్ గా సూట్ అయ్యారు. ఆయన వేసే కొంటె ప్రశ్నలు.. గెస్టులు చెప్పే చిలిపి సమాధానాలు ప్రేక్షకులకు కూడా బాగానే నచ్చుతున్నాయి.

తాజాగా ఆలీతో సరదగా షోకు తెలుగు సీనియర్ నటులు భాను చందర్, సుమన్ వచ్చారు. వీళ్లిద్దరూ ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు కానీ.. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని వీళ్లిద్దరూ ఏలారు. వీళ్లిద్దరూ 80వ దశకంలో హీరోలుగా తెలుగు ఇండస్ట్రీలో చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు.
అయితే.. వీళ్లిద్దరి గురించి ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను వీళ్లు పంచుకున్నారు. నిజానికి సుమన్, భాను చందర్.. క్లోజ్ ఫ్రెండ్స్. హీరోలుగా చేస్తున్నప్పటి నుంచి ఇద్దరూ మంచి మిత్రులు. ఇప్పటికీ వాళ్లు మిత్రులుగానే కొనసాగుతున్నారు. అందులోనూ ఇద్దరూ కరాటేలో బ్లాక్ బెల్ట్. అందుకే షోకు రాగానే ఇద్దరూ కాసేపు కరాటే చేశారు.
ఆ తర్వాత తమ మనసులోని మాటను బయటపెట్టారు. అయితే.. సుమన్ కు, సాయి కుమార్ కు మధ్య ఉన్న గొడవ ఏంటో.. స్పష్టంగా సుమన్ చెప్పేశారు. ఎందుకంటే.. సుమన్ వాయిస్ కు డబ్బింగ్ చెప్పింది సాయి కుమారే కాబట్టి.. ఆ సమయంలో ఇద్దరికీ వచ్చిన గొడవలు ఏంటో.. ఇప్పుడు తెలిసింది.
దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఎపిసోడ్ కోసం వచ్చే ఇంకా కొన్నిరోజులు ఆగాల్సిందే.