Rajani kanth: రజనీకాంత్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన సన్ పిక్చర్స్..!

Share

Rajani kanth: సూపర్ స్టార్ రజనీకాంత్ మేనియా ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన నటిస్తున్న సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా నిర్మాతలు క్యూ కడుతూనే ఉంటారు. అది కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించే పెద్ద నిర్మాణ సంస్థలే కావడం విశేషం. ఎప్పుడో బాబా సినిమా తర్వాత సినిమాలు మానేస్తానని రజనీ చెప్పిన మాట. కానీ ఆ మాటను రజనీ అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క అభిమాని అందుకు ఒప్పుకోలేదు. అభిమానులే కాదు అన్నీ సినిమా ఇండస్ట్రీలోని నటీ నటులు, దర్శక – నిర్మాతలు ఒప్పుకోలేదు.

sun pictures gave shock to rajani-kanth fans
sun pictures gave shock to rajani-kanth fans

దాంతో రజనీ కాంత్ మళ్ళీ సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే గతకొంతకాలంగా ఆయన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడం లేదు. కబాలి, కాలా, పేట, దర్బార్ సినిమాలని భారీ అంచనాల మధ్య విడుదలై ఊహించని విధంగా ఫలితాన్ని అందుకున్నాయి. దాంతో రజనీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలనుకున్న సూపర్ స్టార్ కోలీవుడ్‌లో అజిత్ కుమార్‌కు వరుసగా సూపర్ హిట్స్ ఇస్తున్న మాస్ చిత్రాల దర్శకుడు శివతో అణ్ణాత్త సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

Rajani kanth: రజనీకి పాండిరాజ్ గ్యారెంటీగా భారీ హిట్ ఇచ్చే స్క్రిప్ట్‌తో రెడీ అవుతున్నాడట.

దాంతో ఈ సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ అధినేత కళానిథి మారన్ ఇకపై రజనీతో సినిమాను నిర్మించడం కష్ఠమే అని మాట్లాడుకున్నారు. కానీ ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు షాకిస్తూ సన్ పిక్చర్స్ రజనీతో వెంటనే మరో సినిమాను నిర్మించేందుకు సిద్దమవుతున్నారు. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే పాండిరాజ్ సూర్య, కార్తి, శింబు, శివకార్తికేయన్ లాంటివారికి మంచి కమర్షియల్ హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు రజనీకి గ్యారెంటీగా భారీ హిట్ ఇచ్చే స్క్రిప్ట్‌తో రెడీ అవుతున్నాడట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందని సమాచారం.


Share

Related posts

లండన్ బయల్దేరిన వైఎస్ జగన్ దంపతులు

Siva Prasad

Brahmanandam : తనపై వస్తున్న మీమ్స్ పై బ్రహ్మానందం రెస్పాన్స్ అదుర్స్!? బ్రహ్మీ వ్యక్తిత్వానికి నిదర్శనం..!!

bharani jella

క్యాన్సర్ వ్యాధి మందుల ధరలు భారీగా తగ్గింపు

somaraju sharma