NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sun Tan: 5 నిమిషాల్లో సన్ టాన్ ను తొలగించుకోండి..!!

Sun Tan: ముఖానికి తీసుకున్నంత శ్రద్ధ మిగతా అవయవాల కోసం చూపించరు.. ఎండకి ఎండి కాళ్లు, చేతులు, మెడ నల్లగా మారుతున్నాయి.. సన్ ఎక్కువగా ఇబ్బంది పెట్టే చర్మ సమస్య.. ఇందుకోసం రోజులో ఎక్కువ సార్లు సన్ స్క్రీన్ లోషన్ రాయాలి.. లేదంటే నెలకు ఒకసారైనా కచ్చితంగా పార్లర్ లో బ్లీచ్ చేయించాలి.. ఇందుకోసం ఎంతో కొంత డబ్బు ఖర్చు చేయాలి.. అదే ఇంట్లో లభించే వస్తువులతోనే సన్ టాన్ ను తొలగించవచ్చు..!! సహజ సిద్ధంగా ఇంటి లోనే తయారు చేసుకొని వాడే వీటి వలన చర్మానికి ఎటువంటి హాని జరగదు.. పైగా డబ్బు కూడా ఖర్చు చేయనవసరం లేదు.. సన్ టాన్ ను తొలగించే అద్భుతమైన ప్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!!

Sun Tan: Remove Instantly neck legs hands excellent home remedie
Sun Tan Remove Instantly neck legs hands excellent home remedie

Sun Tan: సన్ టాన్ ను తొలగించే చక్కటి ఇంటి చిట్కా తయారు చేసుకునే విధానం..!!

కావలసిన పదార్థాలు :
మైదా పిండి – 2 టేబుల్ స్పూన్స్, కోల్గేట్ పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, నిమ్మ కాయ – అర చెక్క, బంగాళాదుంప రసం – 2 టేబుల్ స్పూన్స్.

Sun Tan: Remove Instantly neck legs hands excellent home remedie
Sun Tan Remove Instantly neck legs hands excellent home remedie

ముందుగా మైదా పిండిని తీసుకొని అందులో కోల్గేట్ పేస్ట్, బంగాళదుంప రసం వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. మీ శరీరానికి మైదాపిండి పడకపోతే మైదా బదులు గోధుమపిండిని ఉపయోగించవచ్చు. అలాగే మీకు బంగాళదుంప రసం అందుబాటు లో లేకపోతే ఆరెంజ్ జ్యూస్ లేదంటే ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగించవచ్చు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీ కాళ్ళకు, చేతులకు, మెడకు చక్కగా అప్లై చేసుకోవాలి. పదిహేను నిమిషాలు అయిన తర్వాత నిమ్మ చెక్కను తీసుకుని ప్యాక్ అప్లై చేసుకున్న చోట రుద్దాలి. నిమ్మ చక్క తో రుద్దిన తరువాత చల్లటి నీటి తో కడుక్కోవాలి. ఇప్పుడు ఒక టమాటా ను తీసుకుని రెండు ముక్కలుగా కోసుకొని ఎక్కడైతే ప్యాక్ వేసుకున్నామో అక్కడ టమాటో తో రుద్దాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి కడిగేస్తే సరిపోతుంది. టమాటా సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇలా ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే శరీరంపై పేరుకున్న నలుపు తొలగి పోయి చర్మం మెరుస్తుంది. కాళ్లు, చేతులు, మెడ కూడా ముఖం రంగు లోకి వస్తుంది. అప్పుడు శరీరమంతా ఒకే రంగు లో ఉంటుంది.. అలాగే మీరు ఎండ లోకి వెళ్ళేటప్పుడు ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. శరీరంపై స్కార్ఫ్ లాంటిది ఏదైనా కప్పుకోండి. ఎండ లోకి వెళ్లే ముందు గానే సన్ స్క్రీన్ లోషన్ తప్పకుండా రాసుకోండి.. ఈ ప్యాక్ కచ్చితంగా వాడితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మీరు కూడా సన్ టాన్ తో ఇబ్బందిపడుతున్నరా.. ఈ ప్యాక్ ట్రై చేయండి.  ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju