Sunil: ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న అనసూయ అతి తక్కువ కాలంలోనే సినిమారంగంలో అవకాశాలు అందుకోవడం జరిగింది. ఇండస్ట్రీలో చాలా టాపు కీలక ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటూ.. సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తోంది. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లు అని క్రేజ్ ఉన్న వారికి కూడా లేని అవకాశాలు టాప్ ప్రాజెక్టులలో అనసూయ రాబట్టుకుంటుంది.
ఈ రీతిగానే ఇండస్ట్రీ వన్ ఆఫ్ దా టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప లో అనసూయ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా లో రంగమ్మత్త పాత్ర లో అనసూయ నటించిన నటన సినిమా మొత్తానికి హైలెట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా మూవీ లో పుష్ప లో అనసూయ.. ఎటువంటి క్యారెక్టర్ చేస్తుంది అన్నది సస్పెన్స్ గా మారింది.
Read more: Sunil: కచ్చితంగా ఆ సినిమా సునీల్ కి ఇండస్ట్రీలో కం బ్యాక్ మూవీ అవుతుందట..??
కాగా ఇండస్ట్రీ నుండి అందుతున్న టాక్ ప్రకారం సినిమా లో నెగటివ్ షేడ్ పాత్ర చేస్తున్న సునీల్ కి భార్య గా అనసూయ.. నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అనసూయ చేసే పాత్ర సినిమా మొత్తానికి హైలెట్ గా ఉంటుందని సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. అంతమాత్రమే కాకుండా కమెడియన్ సునీల్ ని సరికొత్త విధంగా ఈ సినిమాలో చాలా నెగెటివ్ క్యారెక్టర్లో సుకుమార్ చూపిస్తున్నట్లు సమాచారం. కలర్ ఫోటో సినిమాలో సునీల్ క్యారెక్టర్.. ఊహించని విధంగా ప్రతినాయకుడి పాత్రలో కనపడటంతో అదే ఫ్లవర్.. మరింత డోస్ పెంచేలా.. పుష్పలో సుకుమార్.. సునీల్ నీ చూపించనున్నట్లు సమాచారం.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!