Pushpa: పుష్ప సినిమా విషయంలో టెన్షన్ పడుతున్న సునీల్ ..తేడా కొడితే కనిపించడని భయపడుతున్నాడా..! తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాటలు చూస్తే అదే అనిపిస్తుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియన్ సినిమా పుష్ప భారీ స్థాయిలో డిసెంబర్ 17న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోది. ఈ సినిమా సుకుమార్, అల్లు అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్‌లకు హ్యాట్రిక్ సినిమా.
దాంతో ఈ ముగ్గురు కలిసి ఈ సినిమా కోసం ముందెన్నడూ లేనివిధంగా శ్రమించారు. ఇక హీరోయిన్ రష్మికమందన్న కూడా నెవెర్ బిఫోర్ అనేట్టుగా పుష్ప సినిమా కోసం కష్టపడింది. డీగ్లామర్ రోల్లో కనిపించేందుకు ..సొంతగా డబ్బింగ్ చెప్పుకునేందుకు భాష మీద పట్టు సాధించాలని చాలానే శ్రమించింది. ఇక మేకర్స్‌తో పాటు అందరికీ ఈ సినిమా ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. అందుకే పుష్ప సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. రెండు భాగాలుగా రూపొందనున్న పుష్ప సినిమా పుష్ప ది రైజ్ పార్ట్ 1 రాబోతున్న సమయంలో తాజాగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
Pushpa: హీరోగా సునీల్ ఫేడౌవుట్ ..!
ఈ ఈవెంట్లో సునీల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. హీరోగా సునీల్ ఫేడౌవుట్ అయ్యాడు. కమెడియన్‌గానూ ఆశించిన అవకాశాలు రావడం లేదు. అందుకే విలన్‌గా మారాడు. కానీ, అది కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు పుష్ప సినిమాలో పూర్తిస్థాయి విలన్ పాత్రను పోషించాడు. ఇందులో సునీల్ మేకోవర్ దగ్గర్నుంచి డైలాగ్ డెలివరీ వరకూ అన్నీ చాలా భిన్నంగా ఉన్నాయి. అయితే సునీల్ పోషించిన ఈ రోల్ జనాలకు ఏమేరకు ఎక్కుతుందో..తనని ఇంతకాలం మంచి కమెడియన్‌గా ఆదరించిన ప్రేక్షకులు ఇప్పుడు విలన్‌గా ఆదరిస్తారా లేదా అనే టెన్షన్ ఉందని మాట్లాడాడు. చూడాలి మరి సుకుమార్ సునీల్ మీద చేసిన ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.