Sunil : టాలీవుడ్లో స్టార్ కమెడియన్ గా, హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సునీల్. ఆయన హీరోగా సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. అయితే ఒక్కసారిగా ఈయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. దాంతో కెరీర్ బాగా స్లో అయింది. ఈ దెబ్బకి సునిల్ కెరీర్ ఇక అయిపోయింది అని అందరు మాట్లాడుకున్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ఇలాంటి వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. కానీ అవన్నీ సునీల్ పట్టించుకోలేదు. కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ మళ్లీ పుంజుకొని అవకాశాలు అందుకున్నాడు. తనకి అత్యంత సన్నిహితుడైన దర్శక, రచయిత త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవలో ఓ కీలక పాత్ర పోషించాడు.
ఈ పాత్ర ఒక మాదిరిగా సునీల్ కి పేరు తీసుకు వచ్చింది. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటించిన డిస్కోరాజా సినిమాలో విలన్ పాత్ర పోషించాడు. అయితే ఈ సినిమా ఫ్లాపవడంతో సునీల్ కి అంతగా పేరు రాలేదు. అయినా అవకాశాలు మాత్రం బాగా వస్తున్నాయి. కాగా ప్రస్తుతం సునీల్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే విలన్ గా, కమెడియన్ గా కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో సునీల్ నటిస్తున్నాడు. ఇందులో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. ఫస్ట్ పార్ట్ లో సునీల్ పాత్ర చాలా హైలెట్ అవుతుందట.
Sunil : పుష్ప మూవి సునీల్ కి ఎలాంటి పేరు తీసుకు వస్తుందో.
అంతేకాదు సునీల్ – అల్లు అర్జున్ ల మద్య వచ్చే సీన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు పుష్ప విడుదల తర్వాత సునీల్ పూర్తి స్థాయిలో విలన్ గా చూపించడానికి కొత్త క్యారెక్టర్స్ తయారవుతాయని చెప్పుకుంటున్నారు. ఇక త్రివిక్రమ్.. మహేష్ బాబుతో తెరకెక్కించబోతున్న సినిమాలో సునీల్ కి కమెడియన్ గా మంచి రోల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. చూడాలి మరి పుష్ప మూవి సునీల్ కి ఎలాంటి పేరు తీసుకు వస్తుందో. ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో 5 భాషలలో రిలీజ్ చేయనున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.