Bigg Boss Telugu 5: డేంజర్ జోన్ లో సన్నీ..??

Share

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ సన్నీ ఆటతీరు సై అంటే సై అన్న రీతిలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. టాస్క్.. పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా అన్ని రకాలుగా ఆడియన్స్ నీ ఎంతగానో అలరిస్తూ ఉంటాడు. హౌస్ లో మొదటి నుండి 100% ఎనర్జీ తో ప్రతి టాస్క్ లో… తన బెస్ట్ ఇస్తున్న సన్నీ(Sunny)… ఏడవ వారంలో చాలా హైలెట్ గా ఆడిన సంగతి తెలిసిందే. ఏడో వారంలో టాస్క్ పరంగా…అనేక ఆటుపోట్లు ఎదుర్కొని కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. ముఖ్యంగా 7 వారంలో ప్రియ ఆంటీ(Priya Aunty) భయంకరంగా రెచ్చగొట్టిన గాని.. తనకున్న టెంపర్ తనానికి ఎక్కడ కూడా లుజ్ కాకుండా బరస్ట్ అవ్వకుండా…మైండ్ బ్యాలెన్స్ చేస్తూ.. చాలా చక్కగా గెలవడం జరిగింది.

Bigg Boss Telugu 5: VJ Sunny picks up pace in the game; Leaves Nagarjuna  impressed | PINKVILLA

కానీ 8 వ వారం లో సన్నీ(Sunny) వ్యవహరిస్తున్న తీరు అతని డేంజర్ జోన్ లో పడేసే రీతిలో ఉందని గురువారం ఎపిసోడ్ తర్వాత .. సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. “వెంటాడు వేటాడు” టాస్క్ లో… శ్రీ రామ్ చంద్ర పై… సంచాలకుడిగా ఉన్న జెస్సీ(jessy) తో… మీద.. మీదకు వెళ్లి.., సన్నీ ఆడిన ఆట తీరుపై నెగిటివ్ టాక్ బయట బలంగా వినబడుతుంది. మొదటి నుండి అంతా బాగానే ఉన్నా గానీ మీద మీదకు వెళ్లి హౌస్ లో గట్టి గట్టిగా అరవటం తో పాటు… సంచాలకుడిగా ఉన్న బాధ్యతను కూడా బ్రేక్ చేస్తూ సన్నీ(Sunny) వ్యవహరించడం దారుణం అని అంటున్నారు.

sunny and manas emotional conversation | Bigg Boss 5 telugu Day 44 |Bigg  Boss 5 telugu today's promo - YouTube

వెంటాడు వేటాడు టాస్క్ లో… మనస్ నీ

వెంటాడు వేటాడు టాస్క్ లో… మనస్ నీ… గెలిపించే రీతిలో సన్నీ(Sunny) ఆడటం జరిగిందని.. తన ఫ్రెండ్స్ కోసం అతడు ఆడుతున్న గాని.. బయటకు మాత్రం అది నెగిటివ్ గా ప్రాజెక్ట్ అవుతుందని, ఈ రీతిగానే గత వారం కాజల్ కోసం… ఈవారం మానస్ కోసం … సన్నీ ఆడిన ఆట చాలావరకు మైనస్ అని చెప్పుకొస్తున్నారు. తన ఇండివిడ్యువల్ గేమ్ బాగా ఆడుతున్న గాని ఫ్రెండ్స్ కోసం సన్నిహితులతో గొడవ పడుతూ… హౌస్ లో నెగిటివ్ వాతావరణం తన చుట్టు క్రియేట్ చేసుకుంటున్నాడు అని.. అదే చివరాకరికి కొంప ముంచుతుంది అని.. ముఖ్యంగా రానున్నరోజుల్లో సన్నీకి రాజుల రూపంలో గట్టి షాక్ తగలటం గ్యారెంటీ అని సోషల్ మీడియాలో జనాలు జోస్యం చెబుతున్నారు.


Share

Related posts

Mosagallu Review : ‘మోసగాళ్ళు’ మూవీ ఫస్ట్ హాఫ్ రిపోర్టు

siddhu

ఆర్కే ఇప్పుడు జగన్ ని అన్న మాటలు వింటే…. వైసీపీ అభిమానులు ఏం చేస్తారో….

arun kanna

Big Boss 5: హౌస్ లో కెమెరాల స్పెషాలిటీ చెప్పిన నాగార్జున..!!

sekhar