Bigg Boss 5 Telugu:హౌస్ లో పది మంది సభ్యులలో ఎవరికీ దక్కని అవకాశం.. సన్నీ డైరెక్ట్ ఫినాలేకి..??

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Big boss) సీజన్ ఫైవ్ ప్రారంభమయ్యే 60 రోజులకు పైగానే గడుస్తూ ఉంది. ఇంటిలో 19 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా తొమ్మిది మంది ఎలిమినేట్ అయ్యారు. పదవ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో ఐదుగురు నామినేట్ అయ్యారు. నామినేషన్ లో ఉన్న ఐదుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో.. ఈవారం ఇంటి నుండి ఎవరు బయటకు వెళ్తారు అనేది ఉత్కంఠ భరితంగా మారింది. నామినేషన్ లో ఉన్న వారు.. రవి, సన్నీ, మానస్(Manas), కాజల్ (Kajal), సిరి(Siri). ఈ ఐదుగురు కి బయట మంచి ఓటింగ్ పడే గ్రాఫ్ ఉండటంతో ఈసారి బుధవారం ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది సస్పెన్స్ గా నెలకొంది. పరిస్థితి ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ట్విస్ట్ మీద ట్విస్ట్ లతో… రన్ అవుతోంది. నిన్ననే జెస్సీ(Jessy) అనారోగ్యం కారణంగా.. ఇంటి నుండి బయటకు పంపిచేస్తున్నట్లు ఇంటి సభ్యులను నమ్మించి జెస్సీకి వైద్య పరీక్షలు చేసి ప్రస్తుతం సీక్రెట్ రూమ్ లో ఉంచటం తెలిసిందే. ఇదిలా ఉంటే మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో గార్డెన్ ఏరియాలో కేకు ముక్క పెట్టి.. దీనిని తినే అర్హత ఎవరికి ఉంది అని మూడు క్వశ్చన్ మార్కు లు పెట్టడం జరిగింది.

Bigg Boss Telugu 5': VJ Sunny catches Nagarjuna's eye, riles housemates |  Tv News – India TV

దీంతో ఇంటి సభ్యులు ఆ కేకు ముక్క తినటానికి అనేక డిస్కషన్లు చేస్తూ ఉన్నారు. యానీ(Yaani) మాస్టర్ కెప్టెన్ కావటంతో ఎవరిని కూడా ముట్టుకొని ఆగకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. ఈ తరుణంలో ఆ కేక్ తిని అర్హత తనకే ఉందని రవి మరోపక్క సన్నీ(Sunny) .. ఇంకా చాలా మంది ఇంటి సభ్యులు డిస్కషన్స్ చేస్తూ ఉండగా కెప్టెన్ గా ముందే తాను ఆ కేక్ తినాలని యానీ మాస్టర్ డైలాగులు వేస్తూ ఉన్నారు. కానీ ఆ కేకు తింటే తదుపరి బిగ్బాస్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అన్నది ఇప్పుడు చాలా సస్పెన్స్ గా మారింది. దీంతో ఇంటి సభ్యులు కూడా ఒకవేళ కేక తినేస్తే బయటకు పంపించే చేస్తారేమో… లేకపోతే వచ్చే వారం ఎలిమినేషన్ నామినేషన్ కి డైరెక్ట్ గా బిగ్బాస్(Big boss) నామినేట్ చేస్తాడేమో.. అనే భావనలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే సన్నీ చాలా డేరింగ్ అండ్ డాషింగ్ తో ఆ కేకు ముక్క తినటం జరిగిందట. ప్రోమోలో కూడా చూపించడం జరిగింది.

Bigg Boss Telugu 5': Big spat likely between Sree Rama Chandra, VJ Sunny |  Tv News – India TV

లీక్ వీరుల  సమాచారం…

కేకు బయట ఉంటే పాడై పోద్ది ఏదైనా అవని బరాబర్.. నేను తినేస్తా నాకే అర్హత ఉంది అన్ని సన్నీ కేక్ తినడం జరిగింది. ఇదిలా ఉంటే ఆ కేకు ముక్క తినటంతో సన్నీ డైరెక్టుగా ఫినాలే టికెట్ దక్కించుకున్నట్లు తాజాగా లీక్ వీరుల నుండి అందుతున్న సమాచారం. గతంలో ఈ తరహా లోనే కొంత మంది ఇంటి సభ్యులు.. డైరెక్ట్ ఫినాలే టికెట్… దక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు ఇదే మాదిరిగా సన్నీ తన డేరింగ్ అండ్ డాషింగ్ తో ఏదిఏమైనా జరిగిన తన సిద్ధమే అన్న తరహాలో ఆ కేకు ముక్క తినటంతో… బిగ్ బాస్ సన్నీకి డైరెక్ట్ ఫినాలే వెళ్లే అవకాశాన్ని కల్పించినట్లు.. లేటెస్ట్ టాక్ వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. సన్నీ ఇంటిలో టాస్క్ పరంగా అదేరీతిలో ఎంటర్టైన్మెంట్ పరంగా.. తన హండ్రెడ్ పర్సెంట్ గేమ్ ఎనర్జీ పెట్టి ఆడుతున్నాడు. అదే రీతిలో ఎక్కడా కూడా మాస్క్ ధరించకుండా మరోపక్క ఉన్నదున్నట్టు మాట్లాడుతూ క్లియర్ కట్ గా ఉన్నాడు.. నిజంగా ఇదే జరిగితే సన్నీ ఫినాలే కి వెళ్లడం లో తప్పు లేదని.. తాజా వార్త పై సోషల్ మీడియాలో బిగ్బాస్ ఆడియన్స్ తో పాటు సామాన్య జనులు కామెంట్లు చేస్తున్నారు.


Share

Related posts

ఏపీ స్థానిక ఎన్నికల పై నేడు విచారణ చేయనున్న సుప్రీం కోర్ట్

Siva Prasad

ప్రభాస్ లైఫ్ లో ఫస్ట్ టైం సలార్ కోసం ఇంతగా కష్టపడుతున్నాడు ..?

GRK

మీ పొట్ట ఫుల్ అయినప్పుడు ఇది ఒక్క ముక్క తింటే సరి…

Kumar