Sunny Leone: ఇక్కడ సన్నీ లియోన్ తెలియని వారుండరు. కెరీర్ మొదట ఎలా వున్నా తరువాతి క్రమంలో మాత్రం ఆమె బాలీవుడ్లో తనకంటూ ఓ మంచి గుర్తింపుని సంపాదించుకుంది. అలాగే ఆమెకు నార్త్‌లోనే కాక సౌత్‌లో కూడా మంచి పాపులారిటీ వుంది. అయితే గత కొంతకాలంగా సన్నీ లియోన్ సినిమాలు తగ్గించి, ఫారెన్ లో ఉంటూ.. తాను దత్తత తీసుకున్న పిల్లల బాగోగులు చూసుకుంటోంది. ఇకపోతే తాజాగా ఆమె మొన్న అనగా శనివారం నాడు తన పెళ్లినాటి ఫొటో ఒకటి షేర్ చేసింది.
ఎమోషనల్ అయిన సన్నీ
సన్నీ తన వివాహం ముగిసిన 11 ఏళ్ల తరువాత అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. “ఈ రోజుతో నాకు పెళ్లై 11 సంవత్సరాలు. అప్పుడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. 50 మంది కంటే తక్కువమంది అతిథుల సమక్షంలో మా వివాహం జరిగింది. వాళ్లు మా చేతిలో పెట్టిన ఎన్విలాప్ కవర్లలో వచ్చిన కనుకలతోనే రిసెప్షన్ బిల్లులు కట్టాము. కొందరు తాగిన మత్తులో పిచ్చిపిచ్చిగా వాగారు. ఇద్దరం కలిసి ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేసాము. ప్రేమతోనే అది సాధ్యమైంది. మా పెళ్లి స్టోరీ అంటే నాకెంతో ఇష్టం. హ్యాపీ యానివర్సరీ బేబీ” అని రాసుకొచ్చింది.
డేనియల్ ఎమోషనల్ వర్డ్స్
సన్నీ భర్త డేనియల్ కూడా వారిద్దరి ఫొటో షేర్ చేస్తూ.. “ప్రియమైన సన్నీకి పెళ్లిరోజు శుభాకాంక్షలు. అవును.. మన ప్రయాణం ఒక అద్భుతం. ఇది వర్ణించలేనిది. ఎవరు విడదీయలేనిది!” అంటూ రాసుకొచ్చాడు. ఇక వీరి పిల్లల విషయానికొస్తే, 2017లో నిషా అనే ఆడపిల్లను వీళ్ళు దత్తత తీసుకున్నారు. వెంటనే తరువాత ఇయర్ లో సరోగసి ద్వారా ఆశర్, నోవా అనే కవలలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తన కొత్త సినిమా ‘గాలి నాగేశ్వరరావు’ షూటింగ్లో సన్నీ బిజీగా వుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది.