న్యూస్

Super Job : అదిరిపోయే జాబ్.. బట్టలు సర్దుతూ నెలకు రూ.50,000 సంపాదించండిలా..

super job
Share

Super Job : చిన్నతనం నుంచి 20 ఏళ్ల వయసు వచ్చే వరకు శ్రద్ధగా చదువుకుంటే.. మంచి జీతం అందించే జాబు వస్తుందని అందరూ భావిస్తుంటారు. అయితే ఈ రోజుల్లో కాంపిటేషన్ పెరిగి సంప్రదాయ ఉద్యోగాల సంఖ్య తగ్గడంతో డిగ్రీలు, పీహెచ్‌డీలు చేసిన వారు కూడా ఖాళీగా కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒక యువతి ఓ అదిరిపోయే జాబ్ తనకుతానే సృష్టించుకుంది. ఈ జాబ్ ద్వారా ఆమె నెలకు రూ.50,000 సంపాదిస్తోంది. ఇంతకీ ఏంటా జాబ్? ఆ స్థాయిలో డబ్బు ఎలా సంపాదిస్తుంది? వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Super Job : ఏంటా జాబ్?

super job

సులభంగా డబ్బు సంపాదించే ప్రజలు పాత పనులనే సరికొత్తగా చేసి ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ రోజుల్లో అందరూ విలాసవంతమైన జీవితం గడపడానికి మొగ్గు చూపుతున్నారు. అలాంటి జీవితాన్ని అందించేందుకు వీరు క్రియేటివ్‌గా ఆలోచిస్తూ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు డబ్బులు సంపాదిస్తుంటారు. ఆ కోవలోకే వస్తుంది ఇప్పుడు మనం చెప్పుకోపోయే 19 ఏళ్ల యువతి. ఇంగ్లాండ్‌లోని లైసెస్టర్‌కు చెందిన స్టూడెంట్ ఎల్లా వార్డ్‌రోబ్‌లో బట్టలు కూడా సర్దుకోలేని వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. తాను అద్భుతంగా బట్టలు సర్దగలనని సెల్ఫ్ ప్రమోషన్ చేసింది. అలా కొంత మందిని ఆకట్టుకున్న ఈమె తన టాలెంట్ ఉపయోగించి బట్టలను అద్భుతంగా సర్దడం మొదలెట్టింది. ఆమె పని మెచ్చిన స్థానిక ప్రజలు రెగ్యులర్ గా బట్టలు నీట్ గా సర్దించేందుకు ఆమెనే పిలుస్తున్నారు. ఈ విషయం తెలిసిన మిగతా వారు కూడా ఆమెకు ఈ పనిని అప్పజెప్పుతున్నారు. రోజుకు 3 నుంచి 9 గంటలు పాటు క్రియేటివ్‌గా బట్టలు సర్దుతూ ఆమె ప్రజల మెప్పు పొందుతుంది.

ఆ స్థాయిలో డబ్బు ఎలా సంపాదిస్తుంది?

super job

బట్టల సర్దడంలో ఎల్లా నిష్ణాతురాలు అయింది. దీనివల్ల ఆమెకు లెక్కలేనన్ని ఆఫర్స్ వస్తున్నాయి. తనకు డిమాండ్ పెరగడంతో ఆమె గంటకు ఏకంగా రూ.1500 నుంచి 2000 వసూలు చేస్తోంది. నిజానికి ఎల్లాకి బట్టలు నీట్‌గా సర్దడం అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె తన చిరు ప్రాయం నుంచే ఫ్రెండ్స్, బంధువుల ఇళ్లల్లో బట్టలను నీట్‌గా సర్దేది. వస్త్రాల కలర్ బట్టి, వస్త్రాల రకాల ఆధారంగా ఆమె వార్డ్‌ రోబ్‌లో దుస్తులను బ్యూటిఫుల్ గా తగ్గుతుంది. ఆ ప్రత్యేకతే ఆమెకు మంచి జాబ్ ని క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఆమె 20 మంది కస్టమర్లకు రెండు వారానికి ఒకసారి బట్టలు సర్దిపెడుతోంది. ఈ లెక్కన చూసుకుంటే ఆమె నెలకు దాదాపు రూ.50 వేలు సంపాదిస్తుంది అని చెప్పవచ్చు.

Free Insurance offer: గుడ్ న్యూస్.. ప్రజలకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ఆఫర్ చేసిన ఆ సంస్థ..!


Share

Related posts

Karnataka Politics: యడియూరప్ప రాజీనామాను ఆమోదించిన గవర్నర్..! నూతన సీఎం ఎంపికకు బీజేపి అధిష్టానం కసరత్తు..!!

somaraju sharma

చంద్రబాబూ- కులమూ.! “కమ్మ”దనం ఎక్కడ చెడింది.? (ఎక్సక్లూసివ్ స్టోరీ)

Srinivas Manem

రాయలసీమకు పూర్వ వైభవం తీసుకొస్తా: పవన్

sarath
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar