Super star krishna : సూపర్ స్టార్ కృష్ణకి కెరీర్‌లో మొదటిసారి గ్యాప్ వచ్చింది అప్పుడే.

Share

Super star krishna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా నటశేఖర, సూపర్ స్టార్ అనే బిరుదులను సాధించిన ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణ. సినిమాల పరంగా ఎలాంటి ప్రయోగం చేయాలన్నా కృష్ణ తర్వాతే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ లాంటి అగ్ర నటులున్నా కూడా..వాళ్ళు తీసుకోలేని డేరింగ్ స్టెప్స్ కృష్ణ తీసుకొని సంచలనం సృష్టించారు. తొలి కౌబాయ్ సినిమా, తొలి సినిమా స్కోప్, తొలి ఈస్ట్ మన్ కలర్, తొలి 70ఎంఎం, తొలి భారీ బడ్జెట్..ఇలా ప్రతీ విభాగాన్ని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణది.

super-star-krishna got gap in his career for the first time
super-star-krishna got gap in his career for the first time

కృష్ణ హీరోగా నటించిన సినిమాలు 325 పై చిలుకు ఉన్నాయి. తెలుగు హీరోలలో ఇలాంటి రికార్డు ఉన్నవారు మరొకరు లేకపోవడం గొప్ప విశేషం. కెరీర్ ప్రారంభం నుంచే మంచి కథా బలమున్న సినిమాలను ఎంచుకుంటూ సినిమాలు చేశారు. ఆయన ఒప్పుకున్న కథలను పూర్తి చేయడానికే రోజుకు మూడు షిఫ్టుల్లో సినిమాలు చేశారు. 1966లో తొలి సినిమా తేనెమనసులు విడుదలైంది. 1976కి ( అంటే కేవలం 10 ఏళ్లకే ) 100 సినిమాలు పూర్తి చేశారంటే ఆయన ఎంత వేగంగా సినిమాలు చేస్తూ వచ్చారో అర్థమవుతోంది. ఈ సినిమాలలో సూపర్ హిట్స్ ఎక్కువ..నిర్మాతలకి కాసుల పంట పండినవి ఎక్కువే.

1986 కి 200 సినిమాలు.. 1996 కి 300 సినిమాలు.. ఇలా ప్రతి పదేళ్లకు దాదాపు వంద సినిమాలు పూర్తి చేసేశారు సూపర్ స్టార్. ఇంత వేగంగా సినిమాలు చేయగలగడం ఆయనకి మాత్రమే సాధ్యమైన పని అని ఇప్పటికీ ఇండస్ట్రీలోని ప్రముఖులు అభిప్రాయపడుతుంటారు. ఒకదశలో అయితే ఏలూరులో 21 ధియేటర్లుంటే.. అన్ని ధియేటర్లలోనూ కృష్ణ నటించిన సినిమాలే ప్రదర్శింపబడం గొప్ప విశేషంగా చెప్పుకున్నారు. అంతేకాదు ఇదొక రికార్డుగానూ నిలిచింది. కృష్ణ అంటే నిర్మాతల హీరో. కథ బాలేదని తెలిసినా దర్శక, నిర్మాతల మీద ఇష్టంతో చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటి వల్ల ఆయన కొన్నిసార్లు నష్టపోయారు కూడా.

తెలుగు సినిమాలలో ‘సూపర్ స్టార్’ అనే బిరుదు ఎవరికి ఇవ్విచ్చు.. అనే ఓటింగ్ నిర్వహించింది ప్రముఖ సినీ వారపత్రిక ‘శివరంజని’. అందులో తిరుగులేని ఓటింగ్ ‘కృష్ణ’కు వచ్చింది. దీంతో తెలుగులో ఆయన సూపర్ స్టార్ కృష్ణ అయిపోయారు. ఓపక్క పౌరాణికంలో ఎన్టీఆర్, సాంఘీకంలో ఏఎన్నార్ రాణిస్తుంటే కృష్ణ వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. కృష్ణ ఒక్క హీరోగా మాత్రమే కాదు.. అన్ని విభాగాలపై పట్టున్న గొప్ప టెక్నీషియన్. తెలుగు సినిమాల్లో పలు మార్పులకు ఆయన పునాది వేశారు.

కృష్ణ దర్శకుడిగా మారుతూ ‘సింహాసనం’ సినిమాను తెరకెక్కించారు.అప్పట్లోనే ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ నిర్మించారు. ఈ సినిమాకు భారీ సెట్స్ నిర్మించడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. విడుదలయిన మొదటిరోజు కోటీ యాభై లక్షలు వసూళ్ళు సాధించి సంచలన విజయాన్ని అందుకుంది. ‘ఈనాడు’ లాంటి కమర్షియల్ సినిమాలతో కృష్ణ రేంజ్ మరింతగా పెరిగింది. సింహాసనం, అగ్నిపర్వతం, వజ్రాయుధం, ఊరికి మొనగాడు, వంటి సినిమాలతో పాటు మరెన్నో సినిమాలు కమర్షియల్ గా భారీ హిట్ సాధించాయి. దాదాపు ముప్పై ఏళ్ళు నిర్విరామంగా సినిమాలు చేసిన కృష్ణ కెరీర్ లో మొదటిసారి గ్యాప్ వచ్చింది. సినిమాలు స్పీడ్ గా చేయలేకపోయారు.


Share

Related posts

Life Span: వీటిని తింటున్నారా..!? మీ ఆరోగ్యానికి బోనస్ పాయింట్స్ ఇవే..!!

bharani jella

కాజల్ పెళ్లి : సంబంధం చూసింది ఎవరో కాదు ?

Teja

సైకిలెక్కిన జిగేల్ రాణి

Siva Prasad