YSR: దివంగత వైఎస్ఆర్ ని పొగడ్తలతో ముంచెత్తిన సూపర్ స్టార్ కృష్ణ..!!

Share

YSR: దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్ధంతి ఈ సందర్భంగా నిన్న ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద వైయస్ కుటుంబ సభ్యులతో పాటు నాయకులు పార్టీ కార్యకర్తలు నివాళులు అర్పించడం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున వైయస్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీపరంగా ఘనంగా నిర్వహించారు. ఇక ఇదే క్రమంలో హైదరాబాద్ నగరంలో 12 వ వర్ధంతి నాడు వైఎస్ విజయమ్మ అ వైఎస్ఆర్ సంస్మరణ సభ అంటూ.. పార్టీలకు రాజకీయాలకతీతంగా నిర్వహించడం తెలిసిందే.

వైయస్సార్ పై సూపర్ స్టార్ కృష్ణ కీలక వ్యాఖ్యలు..

ఈ సభకి వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన దగ్గర పనిచేసిన అధికారులు కొంతమంది కీలక నాయకులు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వైయస్ తో వారికి ఉన్న అనుబంధం గురించే అదే రీతిలో ఆయన తీసుకునే నిర్ణయాలు మరియు పరిపాలన పరంగా ఆయన ఇచ్చే హామీలు వాటి అమలు తీరు గురించి అనేక విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ఈ సభకు నేరుగా రాకపోయినా వీడియో సందేశంలో వైయస్సార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు సూపర్ స్టార్ కృష్ణ. రాజీవ్గాంధీ ప్రోద్బలం వల్ల తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు.. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్ గా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారని తెలిపారు.

 

అయితే తాను నిర్వహించే ప్రతి సభకి పిసిసి ప్రెసిడెంట్ గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చేవారిని తనను ఎంతగానో సపోర్ట్ చేసే వారని పేర్కొన్నారు. అంత మాత్రమే కాక ఏలూరు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన టైంలో అదే టైంలో.. కడప పార్లమెంటు సభ్యుడిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారని ఢిల్లీలో పార్లమెంటు సభ్యులు టైములో.. తనతో ఎంతో అనుబంధంగా స్నేహశీలి గా మాట్లాడేవారని కృష్ణ తెలిపారు. అనంతరం రాజు గాంధీ చనిపోవడంతో చాలా డిప్రెషన్ కి గురి అయ్యి ఇక పూర్తిగా తాను రాజకీయాలకు దూరం అయినట్లు తెలిపారు. కానీ ఆ సమయంలో ఎక్కడా కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి.. వెనకడుగు వేయకుండా కాంగ్రెస్ పార్టీ నీ పైకి తీసుకురావడం జరిగిందని.. సోనియా గాంధీతో తెలుగు ప్రాంతాలలో అనేక చోట్ల పర్యటనలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి అధికారంలోకి తెచ్చారని వైఎస్ఆర్ కృషి అభినందనీయమని కృష్ణ పొగిడారు.

 

ఆయన ముఖ్యమంత్రి అవడం వల్ల చాలామంది సంతోషించడం జరిగిందని.. అప్పట్లో ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవడం నిజంగా చాలా గ్రేట్ అని కానీ హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోవడం తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టం అని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని అటువంటి మంచి నాయకుడు లేకుండా పోవటం దేవుడు అన్యాయం చేసినట్లు భావిస్తున్నట్లు కృష్ణ .. వైయస్సార్ సంస్మరణ సభలో.. వీడియో రూపంలో తన సందేశాన్ని అందించారు. ఇదే కార్యక్రమంలో వైఎస్ఆర్ ఆత్మ గా పిలువబడే కె.వి.పి.రామచంద్రరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆయన హయాంలో ఆయనకు దగ్గరగా ఉండే చాలా మంది అధికారులు నాయకులు.. వైయస్ఆర్ వ్యక్తిత్వం గురించి ఆయన ఇతరుల పట్ల చూపించే ప్రేమ గురించి.. పొగడ్తలతో ముంచెత్తారు. ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేసేవారిని చెప్పుకొచ్చారు.


Share

Related posts

బ్రేకింగ్: నూతన్ నాయుడుపై శిరోముండన ‘భారం’… నిజంగానే తప్పు చేశాడా?

Vihari

Sonu Sood: సోను సూద్ హెల్ప్..చేతులెత్తి దండం పెట్టిన క్రికెట్ ప్రేమికులు!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ తో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన బాలీవుడ్ టాప్ బ్యూటీ ..??

sekhar