Gangavva : బిగ్ బాస్ గంగవ్వ గురించి తెలుసు కదా. మై విలేజ్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన గంగవ్వ.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే తనకున్న పాపులారిటీ వేరు. తను ఇప్పుడు పెద్ద సెలబ్రటీ. ఎక్కడి లంబాడిపల్లి… ఎక్కడి హైదరాబాద్… ఎక్కడి సినిమా ఇండస్ట్రీ. కష్టపడి పనిచేస్తే… విజయం నీ సొంతం కావాల్సిందే అని చెప్పడానికి గంగవ్వే ఉదాహరణ. ఒక సాధారణ స్థాయి మహిళ.. ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయింది అంటే మామూలు విషయం కాదు.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాక గంగవ్వ రేంజే మారిపోయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక గంగవ్వకు చాలా ఆఫర్లు వచ్చాయి. అయినా కూడా తన ఆరోగ్య కారణాల దృష్ట్యా తను పెద్దగా టీవీ షోలలో పార్టిసిపేట్ చేయకున్నా… తనకంటూ సొంత యూట్యూబ్ చానెల్ ను స్టార్ట్ చేసింది గంగవ్వ.
ప్రస్తుతం తన యూట్యూబ్ చానెల్ తో ఫుల్ టు బిజీ అయిపోయింది గంగవ్వ. అప్పుడప్పుడు వీడియోలను అప్ లోడ్ చేస్తుంది. అలాగే… కింగ్ నాగార్జున.. గంగవ్వకు సొంత ఇల్లు కూడా కట్టిస్తున్నాడు.
Gangavva : గంగవ్వతో సరదాగా కాసేపు గడిపిన గంగవ్వ
గంగవ్వ ఇంటికి వెళ్లిన సూపర్ సుజాత… గంగవ్వతో కలిసి కాసేపు సరదాగా గడిపింది. ఆ తర్వాత తన కొత్త ఇంటికి వెళ్లి అక్కడ తన కొత్త ఇల్లు నిర్మాణాన్ని చూసింది. ఆ తర్వాత అందరూ కలిసి మామిడితోటకు వెళ్లి అక్కడ మంచిగా చికెన్ వండుకొని తిన్నారు. మొత్తానికి బిగ్ బాస్ సుజాత చేసిన హడావుడిని మీరు కూడా చూడండి.