ఆస్ట్రేలియా వేదికగా ఆ దేశంతో జరుగుతున్నా బాక్సింగ్ డే రెండో టెస్ట్ ను భారత్ 8 వికెట్ల తేడాతో ఒక రోజు మిగిలి ఉండగానే గెలిచింది… 69 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి సాధించి… ఒక అద్భుత విజయం సాధించింది.. భారత్ కు ఈ గెలుపు ఎప్పటికి చిరస్మరణీయం ఎందుకు అంటే…. దానికి గల కారణాలు ఏమంటే..??
** విరాట్ కోహ్లీ లేడు… ధోని లేడు.. ఇషాంత్, భువనేశ్వర్, షమీ లాంటి బౌలర్లు లేరు.. చాల నామమాత్రపు జట్టు.. జట్టులో పెద్ద సీనియర్ ఎవరంటే రహానే ఒక్కడే.. అసలు ఏ మాత్రం అంచనాలు లేని, ఒక ఘోర పరాభవం తర్వాత బరిలోకి దిగిన టీమ్ ఇండియా …. ఆసీస్ గడ్డ మీద నే ఆ టీమ్ ను చక్కగా ఓడించి చక్కని సమాధానం ఇచ్చింది. ఏది చాలామందికి చిన్న విషయంలా అనిపించినా… ఆస్ట్రేలియా లాంటి జట్టు అది సొంత గడ్డ మీద సిరీస్ సమం చేయడం అనేది.. చిన్న జట్టుగా బరిలోకి దిగిన జట్టు బాటింగ్ బౌలింగ్ లో రాణించి ఆధిక్యంలో ఉన్న కంగారులను కంగారు పెట్టడం అనేది పెద్ద విషయమే… క్రికెట్ ప్రేమికులే కాదు.. క్రికెట్ పండితులు సైతం ఈ విజయాన్ని చిరస్మరణీయమే అని చెబుతున్నారు…
** పెద్ద స్టార్లు ముఖ్యంగా బీసీసీఐ వద్ద ఏ గ్రేడ్ కాంట్రాక్టులో లేని ఏ స్టార్ కూడా బాక్సింగ్ డే రెండో టెస్ట్ లో లేరు కెప్టెన్ రహానే సైతం బి గ్రేడ్ లో ఉన్నాడు. అంటే పెద్ద స్థాయి క్రికెటర్, స్టార్లు లేకుండా… కేవలం 4 రోజు పూర్తికాకుండానే ఇండియా టెస్ట్ గెలవడం పెద్ద విషయమే..
** గులాబీ రంగు బంతి సాధారణ క్రికెట్ బంతులతో పోలిస్తే కాస్త బిన్నంగా స్పందిస్తుంది… వేగం… చూపు.. టైమింగ్ సరిగా ఉంటేనే ఈ బంతి మీద పూర్తిస్థాయి గ్రిప్ లభిస్తుంది.. అలాంటి బతి మీద పూర్తి పట్టు సాధించి మొత్తం మ్యాచ్ అంతలోనూ సెంచరీ సాధించిన కెప్టెన్ రహానే ఇన్నింగ్స్ మరపురానిదే… దింతో గెలుపు చిరస్మరణీయమే..
** ఆస్ట్రేలియా జట్టులో ఉన్న టాప్ ఆర్డర్ ను రెండు ఇన్నింగ్స్ లలో తక్కువ స్కోర్ కె ఇంటికి పంపడంలో ఇండియా బౌలర్లు సమష్టిగా రాణించారు.. పేస్ విషయంలో బుమ్రా, సిరాజ్ మంచి ప్రతిభ చూపితే .. స్పిన్ విషయంలో అశ్విన్, జడేజా అద్భుతంగా కట్టడి చేసారు. బౌలర్లు రాణించడంతో ఇండియా విజయం సాధించింది అని చెప్పాలి. కాబట్టి గెలుపు మంచిదే..
** ఆస్ట్రేలియా సాధారణంగా ఒక మ్యాచ్ గెలిచి ఆధిక్యంలోకి వెళితే మల్లి ఆ జట్టు వేగాన్ని అందుకోవడం సాధ్యం కాదు.. ఒకే రకమైన మెరుపు వేగాన్ని పాటించి క్లీన్ స్వీప్ పైన ద్రుష్టి పెడుతుంది. కాబట్టి సొంత గడ్డ మీద ఆసీస్ ను కట్టడి చేయడం పెద్ద విషయమే. అందుకే గెలుపు ప్రత్యేకం.
** స్ట్రాక్, కమ్మిన్స్ వంటి ఫాస్ట్ త్రయాన్ని ఎదుర్కొని మొదటి ఇన్నింగ్స్ లో మంచి పరుగులు సాధించి ఆస్ట్రేలియా కు సవాల్ విసరడం కొత్త విషయమే. అందులో ఆస్ట్రేలియా పిచ్ లలో భరత్ అంత పెద్ద స్కోర్ చేసి.. దాని తర్వాత ఏ మాత్రం అశ్రద్ధ వహించకుండా మల్లి ఆసీస్ బాట్స్మన్ నడ్డి విరిచి గెలుపు పొందటం పెద్ద విషయమే.