Superstar Krishna: అప్పటిలో టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ సృష్టించిన రికార్డులు గురించి మన అందరికి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ Superstar Krishna వివాదాల్లో చిక్కుకోవడం బహుశా మనం ఎప్పుడూ చూసి ఉండం. ఇప్పటికే ఎన్నో పాత్రలలో నటించారు సూపర్ స్టార్ కృష్ణ. తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అప్పటిలో ఈయన స్టైల్ కు ఎంతో మంది అభిమానులు ఉండేవారు.
కృష్ణ తన సన్నిహితులతో తరచు తన జీవితంలో మూడు తప్పు చేశానని అంటూ ఉంటారట. అభిమానుల దృష్టిలో సూపర్ స్టార్ కృష్ణ చాలా గొప్ప వ్యక్తి అలాగే ఆయన ఎప్పుడూ వివాదాలలో చిక్కుకున్నది కూడా వారికి తెలియదు. అలాంటిది సూపర్ స్టార్ కృష్ణ చేసిన ఆ మూడు తప్పులు ఏంటా అని ఆలోచిస్తున్నారా?
సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల మన అందరికి తెలిసిన వ్యక్తే. అయితే ఆమె తన కెరీర్ ప్రారంభంలో నటి కావాలి అని ఎంతో ఆశపడేవారట. కానీ అప్పటిలో అందుకు కృష్ణ గారు అడ్డుపడ్డారట. సూపర్ స్టార్ కృష్ణ గారికి రమేష్ బాబు అలాగే మహేష్ బాబు అని ఇద్దరు కొడుకులు ఉన్న విషయం మనకి విదితమే. అయితే ఆయన వీరిద్దరిని హీరోలుగా సినీ పరిశ్రమకి పరిచయం చేయాలనుకున్నారు కానీ మంజుల విషయంలో మాత్రం ఆయన దైర్యం చెయ్యలేకపోయారట. అలాగే అయన చేసిన రెండో తప్పు ఏమిటంటే తన కొడుకు రమేష్ బాబు ని హీరోని పరిచయం చెయ్యడమేనట. మహేష్ ని హీరో గా ఇండస్ట్రీ కి పరిచయం చేసి మంచి పనిచేసా కానీ రమేష్ ఇంకేదైనా రంగంలోకి పంపించి ఉంటే బావుండేది అని అంటూ ఉంటారట. రమేష్ బాబు ఒకటి రెండు సినిమాలలో కనిపించి ఆ తర్వాత కొంత కాలం ప్రొడ్యూసర్ చేశారు.