Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది తమిళ సెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పి కొత్త పార్టీ పెడతాను అంటూ గత ఏడాది చివరి వరకు హడావిడి చేసి లాస్ట్ లో డ్రాప్ అయిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల అభిమానులు ఎంతగానో అంచనాలు పెట్టుకొని భారీ స్థాయిలో ..రజనీ కొత్త పార్టీ కోసం భారీగా ఏర్పాటు చేయడం జరిగింది.
కానీ అనూహ్యంగా ఆయన అనారోగ్యం కారణంగా ..రాజకీయాల్లోకి వెళ్ళటం దైవ నిర్ణయం కాదని భావించి ..అభిమానులకు మూడు పేజీల లెటర్ రాసి ..తాను పొలిటికల్ ఫీల్డ్ లోకి దిగటం లేదని స్పష్టం చేశారు. దీంతో అభిమానులు ఎంతగానో నిరుత్సాహం చెందారు. ఇదిలా ఉంటే తాజాగా రజనీకాంత్ త్వరలో ఓ పొలిటికల్ నేపథ్యంలో సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా లో ఎమ్మెల్యేగా రజినీకాంత్ కనిపించనున్నట్లు.., సొంత నియోజక వర్గాన్ని అద్భుత రీతిలో అభివృద్ధి చేసి చివరాకరికి ఎన్నో రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొనే చివరాకరికి ముఖ్యమంత్రి అయ్యే రీతిలో సినిమా ఉండబోతున్నట్లు ఓ వార్త.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ వార్త చూసిన చాలా మంది నెటిజన్లు.. రియల్ గా కాకపోయినా మరోసారి రజనీకాంత్ ని తెరపైన పొలిటికల్ లీడర్ గా చూసుకుని అభిమానుల సంతోష పడతారని కామెంట్లు పెడుతున్నారు.