NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల పిటిషన్ పై ఎస్బీఐకి బిగ్ షాక్ ..రేపటిలోగా ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందేనన్న సుప్రీం కోర్టు

Electoral Bonds: ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అదనపు సమయం కోరడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రేపటి (మార్చి12)లోగా విరాళాల వివరాలు ఈసీకి ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు బ్యాంకు చేసిన అభ్యర్ధనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

Supreme Court

అలాగే ఆ సమాచారాన్ని మార్చి 15 సాయంత్రం 5 గంటల లోపు బహిర్గతపర్చాలని ఈసీకి స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్ 30 వరకూ పొడిగించాలంటూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.

రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందిచడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల 15న సుప్రీం కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాటి ద్వారా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఈ నెల 6వ తేదీలోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఆరోజు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఎస్బీఐని ఆదేశించింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్బీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

దాతలు, గ్రహీతల వివరాలను వేరువేరుగా భద్రపరిచామని, వాటిని మ్యాప్ చేసి వివరాలను ఇచ్చేందుకు మరింత సమయం కావాలని బ్యాంకు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ధర్మాసనం ఆదేశాల మేరకు కొత్తగా బాండ్లను జారీ చేయడాన్ని నిలిపివేశామని చెబుతూ, బాండ్ల  కొనుగోలు చేసిన వారి వివరాలు కోర్ బ్యాంకింగ్ సిస్టంలో నమోదు కాలేదనీ, బాండ్ల కొనుగోలుదారుల వివరాలు రహస్యంగా ఉంచాలని నిబంధనల్లో ఉందని అన్నారు.

తమ వద్ద అందరి వివరాలు ఉన్నాయని, అలాగే వాటిని తమకు అనుకూలంగా మలుచుకున్న పార్టీల వివరాలు కూడా ఉన్నాయని, వీటిని వెల్లడించే హడావుడి, తొందరపాటు లో తప్పు జరగకుండా చూసుకోవాలన్నదే తమ అభిమతం అని, తీర్పును పరిశీలిస్తే ..బాండ్ల కొనుగోలుదారుల వివరాలతో పాటు వాటిని తీసుకున్న రాజకీయ పార్టీల వివరాలు ఇవ్వాలని ఉందన్నారు.ఈ రెండింటినీ జోడించకుండా వివరాలు ఇవ్వాలంటే మూడు వారాల్లోగా ఇచ్చేందుకు స్టేట్ బ్యాంకు సిద్దమని, తమకు కొంత సమయం ఇవ్వాలని సాల్వే వాదనలు వినిపించారు.

ఎస్బీఐ వాదనలపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొనుగోలుదారులు, రాజకీయ పార్టీల వివరాలన్ని ముంబై మెయిన్ బ్రాంచిలో ఉన్నాయని అఫిడవిట్ లో చెప్పారు కదా. అలాగే బాండ్ల కొనుగోలు దారులు, రాజకీయ పార్టీల వివరాలను మేం మ్యాపింగ్ చేసి వివరాలు వెల్లడించాలని ఆదేశించలేదు. మీ దగ్గర ఉన్నది ఉన్నట్లుగా సమాచారం ఇవ్వాలని మాత్రమే కోరాం. బాండ్లు కొన్నవారి వివరాలన్ని సీల్డ్ కవర్ లో ఉన్నాయని చెప్పారు. వాటిని తెరిచి వివరాలు ఇస్తే సరిపోతుంది. తమ వద్ద ఉన్న సమాచారాన్ని సీల్డ్ కవర్ లో ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాం.. వాటిని మేం తెరవలేదు..బాండ్ల రద్దుపై ఫిబ్రవరి 15న తీర్పు నిచ్చాం.

ఇవాళ మార్చి 11, ఈ 26 రోజుల్లో ఏం చేశారో స్టేట్ బ్యాంక్ చెప్పలేదు. స్టేట్ బ్యాంక్ నుండి మేం నిజాయితీ ఆశించాం. ప్రతి లావాదేవీకి కేవైసీ ఉంది. తప్పు జరిగే అవకాశం ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సీల్డ్ కవర్ తెరవాలని ఆదేశిస్తాం.. స్టేట్ బ్యాంక్ మా ఆదేశాలు పాటించాలని. రాజకీయ పార్టీల వివరాలు అందించడానికి మూడు వారాల గడువెందుకు. బాండ్లు కొన్నవారి వివరాలు మీ వద్ద సిద్దంగా ఉన్నాయి అని కోర్టు పేర్కొంది. మార్చి 12 సాయంత్రం పని గంటలు ముగిసే లోగా దాతల వివరాలను మీరు ఈసీకి అందజేయాల్సిందేనని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఆ వివరాలను బహిర్గతపర్చాలని ఈసీకి సూచించింది.

MP Magunta Srinivasulu Reddy: ఎంపీ మాగుంటను కలిసిన టీడీపీ నేతలు .. కీలక నిర్ణయాన్ని ప్రకటించిన మాగుంట..!

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju