సుప్రీం కోర్టులో ఏపి సర్కార్ కు బిగ్ రిలీఫ్ లభించింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తునకు ఏపి సర్కార్ ఏర్పాటు చేసిన సీట్ కు లైన్ క్లీయర్ అయ్యింది. సిట్ పై ఏపి హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీం కోర్టు కొట్టివేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్లు వైఎస్ జన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే .. ఆ సిట్ నియామకంపై టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు ఏపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, సిట్ పై హైకోర్టు స్టే ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఏపి హైకోర్టు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవికుమార్ లతో కూడిన సుప్రీం దర్మాసనం.. ధర్యాప్తు ప్రాధమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదని అభిప్రాయపడింది. సీబీఐ, ఈడీ దర్యాప్తునకు సైతం ఏపి ప్రభుత్వం పంపేందుకు సిద్దమైన ఈ కేసులో స్టే అవసరం లేదని పేర్కొంది. హైకోర్టు తీర్పును పక్కన పెడుతున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
ఈ కేసును మెరిట్ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టుకు సుప్రీం సూచించింది. సుప్రీం కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో సంబంధం లేకుండా మెరిట్స్ ప్రాతిపదికన ఈ కేసును విచారించి తుది నిర్ణయం వెలువరించాలని హైకోర్టు సూచించింది. దీంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తునకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయ్యింది. మరో వైపు అమరావతి భూ కుంభకోణం సహా కీలక ప్రాజెక్టులు విధానాలలో జరిగిన అవినీతిపై దర్యాప్తునకు ఆటంకాలు తొలగిపోయాయి.
Breaking: గ్యాంగ్ స్టర్ల రహస్య స్థావరాలపై పోలీసుల దాడులు .. భారీగా నగదు, ఆయుధాలు స్వాధీనం..?